నాన్నతో సవారీ.. ఏంజెలికా సాహస యాత్ర.!

by Daayi Srishailam |

ఏంజెలికా తండ్రి బాటలో నడుస్తూ సాహసయాత్రలు చేస్తోంది

నాన్నతో సవారీ.. ఏంజెలికా సాహస యాత్ర.!
X

దిశ, ఫీచర్స్: పిల్లలతో స్నేహంగా ఉంటే వాళ్లకేం నేర్పించొచ్చో తెలుస్తుంది. కానీ ఎవరు నేర్పుతున్నారు.? తమ పిల్లలు డాక్టరవ్వాలి.. ఇంజినీరవ్వాలి అని కలగనడం తప్పితే వారికి జీవితం నేర్పించాలనే ధ్యాస ఎంతమందికి ఉంది.? కానీ.. బెంగళూరుకు చెందిన అజయ్ డానియల్ తన గారాల కూతురు ఏంజెలికా తండ్రి బాటలో నడుస్తూ సాహసయాత్రలు చేస్తోంది.

తండ్రీ కూతర్ల బంధం..

కన్యాకుమారి నుంచి థాంగ్ గ్రామం వరకు 7వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ సాహస యాత్రను తన తండ్రితో కలిసి విజయవంతంగా పూర్తిచేసుకుంది ఏంజెలికా. మామూలుగా పేరెంట్స్ ఏదైనా టాస్క్ ఇస్తే పిల్లలు కేర్ చెయ్యరు. ఎప్పుడూ ఏదో చెప్తారని విసుక్కుంటారు. కానీ ఏంజెలికా అలా కాదు. నాన్నతో కలిసి పెద్ద టాస్కే కంప్లీట్ చేసింది. 14 రోజుల్లో కన్యాకుమారి నుంచి థాంగ్ వరకు 5930 కిలోమీటర్లు పూర్తిచేసుకొని "యంగెస్ట్ పిల్లియన్ రైడర్"గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. దీనిని కేవలం యాత్రగానే కాకుండా తండ్రీ కూతర్ల బంధాన్ని అర్థంచేసుకునే యాత్రగా చెప్పుకోవచ్చు.

ఫస్ట్ అడ్వెంచర్..

2021లో ఏంజెలికా 10వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. వాళ్ల నాన్న ఖర్దుంగ్‌లా బైక్ ట్రిప్‌కు రమ్మని ప్రపోజల్ పెట్టాడు. ఖర్దుంగ్‌లా ప్రపంచంలోనే అత్యున్నత మోటరబుల్ రోడ్. నాన్న సవాలున స్వీకరించింది ఏంజెలికా. మొదట దీనిని చండీగఢ్ నుంచి లెహ్ వరకు ప్లాన్ చేశారు. అజయ్ డేనియల్ స్నేహితులు అక్కడితోనే వెనుదిరిగారు. ఏంజెలికా మాత్రం ముందుకు సాగుదామని వాళ్ల నాన్నతో చెప్పింది. ఇలాంటి సాహసం చేసే అవకాశం మళ్లీ వస్తుందో రాదో అనేది తన సందేహం. అజయ్ ఓకే చెప్పడంతో లైఫ్‌లో ఫస్ట్ టైం అద్భుతమైన అడ్వెంచర్ చేసింది ఏంజెలికా.

సవాళ్ల మధ్య సవారీ..

బైక్ యాత్రను ఏంజెలికా ఏదో సరదా ట్రిప్‌గా భావించలేదు. దీన్నొక జీవిత పాఠం అనుకుంది. 2023లో కన్యాకుమరి నుంచి థాంగ్ వరకు 24 రోజుల్లో 7000 కిలో మీటర్లు ప్రయాణించారు. హైదరాబాద్.. మధురై.. బెంగళూరు.. నాగ్‌పూర్.. ఝాన్సీ.. గురుగ్రామ్.. చండీగఢ్.. ఉధంపూర్.. శ్రీనగర్.. కార్గిల్.. లెహ్.. పాంగాంగ్.. న్యోమా.. హాన్లే జోజీలా.. నమికాలా.. ఫోటులా.. ఖర్దుంగ్లా.. ఫోటిలా.. అమ్లింగ్లా.. తంగ్‌లాంగ్లా వంటి సరిహద్దులు దాటి వందలాది హృదయాలకు దగ్గరయ్యారు. మనాలీకి వెళ్తుండగా 4 రోజులు అటవిలో చిక్కుకున్నారు. ఇలాంటి ఎన్నో సవాళ్ల మధ్య వారి గమ్యం చేరుకున్నారు ఈ తండ్రీ కూతుర్లు.

Next Story