- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో బంగారు పతకం సాధించి ట్రంప్ మనసు గెలిచాడు
ఒలింపియాడ్‌లో గెలిచి.. వైట్‌హౌజ్‌లో ట్రంప్‌తో నిలిచి

దిశ, ఫీచర్స్: ప్యారిస్ వేదికగా 2025లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో ఐదుగురు యువకులు అమెరికాకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు మొదటిసారి ఐదు బంగారు పతకాలు కూడా సాధించారు. ఈ విజయం యువ ప్రతిభను చాటి చెప్తోంది.
వైట్‌హజ్‌లో సత్కారం..
ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఆ ఐదుగురు విజేతలే అగస్త్య గోయల్.. అలెన్ లీ.. జోషువా వాంగ్.. ఫియోడర్ యెవ్టుషెంకో.. బ్రయాన్ జాంగ్. ఈ రికార్డు నెలకొల్పినందుకు వారిని వైట్ హౌస్‌లో ఘనంగా సత్కరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరి ప్రతిభకు మెచ్చి ప్రత్యేకంగా అభినందించాడు. తన అడ్వయిజర్ మైకెల్ క్రాట్సియోస్ ఎక్స్‌లో ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ఒలింపియాడ్ ఛాంపియన్లను వైట్ హౌస్‌కు ఆహ్వానించడం గర్వకారణమన్నాడు. మొదటిసారి విజయం సాధించడంతో సంతోషంగా ఉందన్నారు.
కంప్యూటర్స్ నుంచి ఫిజిక్స్..
ఐదుగురు గోల్డ్ మెడలిస్టుల్లో 17 ఏళ్ల అగస్త్య గోయల్ ప్రత్యేకంగా నిలిచాడు. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో హెన్రీ ఎం. గన్ హైస్కూల్లో చదువుతున్నాడు అగస్త్య. వాళ్ల నాన్న స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్ అశిష్ గోయల్. అశిష్ 1990లో ఐఐటీ- జేఈఈలో టాప్ ర్యాంకర్. స్టాన్ఫర్డ్‌లో పీహెచ్‌డీ చేసి ట్విట్టర్‌కు అడ్వయిజర్‌గా పనిచేశాడు. ఇలా అగస్త్యకు మేధోశక్తి వారసత్వంలా వచ్చింది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మాటిక్స్‌లో రెండుసార్లు గోల్డ్ మెడలిస్ట్ తను. 2024లో ప్రపంచంలో నాలుగో ర్యాంక్ సాధించాడు. కంప్యూటర్ సైన్స్ నుంచి ఫిజిక్స్ వైపు మళ్లిన అగస్త్య ప్యారిస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
80కి పైగా దేశాలతో పోటీ..
అగస్త్యకు మొదట కంప్యూటర్ సైన్స్ పట్ల ఆసక్తి ఎక్కువ. యూఎస్ఏ కంప్యూటింగ్ ఒలింపియాడ్లో 2022-2024 మధ్య మూడుసార్లు ఫైనలిస్ట్‌గా నిలిచాడు. మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్‌లో పాల్గొని ప్రమ్స్ యూఎస్ఏలో భాగమయ్యాడు. ఐతే 2023లో తన ఆసక్తి క్రమంగా ఫిజిక్స్ వైపు మళ్లింది. అగస్త్య చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటాడు. ఫ్రిస్బీ.. టెన్నిస్ వంటి ఆటల పట్ల ఆసక్తి ఎక్కువ అతనికి. ఇంకా సంగీతం అంటే చెవి కోసుకునేంత ఇష్టం. మొత్తానికి 80కి పైగా దేశాలతో పోటీపడి ఫిజిక్స్ ఒలింపియాడ్లో విజయం సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.






