Viral Video: శభాష్ రైతు బిడ్డా.. నీ తెలివికి జోహార్లు.. రూపాయి ఖర్చు లేకుండా అడవి పందుల్ని తరిమికొట్టే ఐడియా

by Vennela |

Viral Video: ఆరుగాలం కష్టపడ్డ రైతుపై పంటను చంటిపాపలా కాపాడుకోవడం అనేది ఒక కత్తి మీద సాము అని చెప్పవచ్చు.

Viral Video: శభాష్ రైతు బిడ్డా.. నీ తెలివికి జోహార్లు.. రూపాయి ఖర్చు లేకుండా అడవి పందుల్ని తరిమికొట్టే ఐడియా
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఆరుగాలం కష్టపడ్డ రైతుపై పంటను చంటిపాపలా కాపాడుకోవడం అనేది ఒక కత్తి మీద సాము అని చెప్పవచ్చు. పంట వేయడం ఒక ఎత్తు అయితే, దానికి పురుగు పుట్రా సోకకుండా మందు కొట్టడం మరో ఎత్తు. అలాగే ఆ పంటను కంటికి రెప్పలా కాపాడుకొని మార్కెట్ వరకు చేర్చడం మరో ఎత్తు, అక్కడి నుంచి దానిని విక్రయించి డబ్బు పొందడం మరో ఎత్తు, వచ్చిన డబ్బును అప్పుల వారికి కట్టుకోవడం మరొక ప్రహసనం.

వీటి మధ్యలో కొన్నిసార్లు ప్రకృతి బీభత్సాలు వస్తే ఆ రైతు కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. తెచ్చిన అప్పుకు వడ్డీలు మిగులుతాయి. చేతికి పంట రాకుండా పోతుంది. కొన్ని ప్రాంతాల్లో అడవి పందుల వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ అడవి పందులు రాత్రిళ్ళు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటాయి.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఒక రాత్రిలోనే దుక్కి దున్ని నాశనం చేసేస్తుంటాయి. అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి వేరుశనగ పంట, కందిచేను, చెరకు, ఇలా ఆహార పంటల నిండిపైన అడవి పందులు పెద్ద ఎత్తున దాడి చేస్తుంటాయి. అయితే ఈ అడవి పందుల బెడదను తొలగించడానికి ఓ యువకుడు రైతుబిడ్డ ఒక చక్కటి చిట్కా అందించారు.

ఒక చెట్టుకు బ్యాటరీ లైట్ వెలిగించి దాని ఎదురుగుండా రెండువైపులా అద్దం ఉండేలా గాజు పలకను తాడుకు గట్టి గాలిలో వేలాడదీశాడు. ఇప్పుడు ఆ బ్యాటరీ లైఫ్ ఫోకస్ అద్దంపై పడితే గాలికి ఆ అర్థం కదులుతూ నాలుగు వైపులా లైట్ పడేలా చేస్తుంది. దీంతో పొలంలో లైట్ పడటం వల్ల జంతువులు అదేవిధంగా దొంగల బెడద నుంచి బయటపడవచ్చు అని ఆ వీడియోలో వ్యక్తి మనకి వివరిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు శభాష్ అని అతని ప్రయత్నానికి తోడ్పాటు అందిస్తున్నారు.



Next Story