23% విద్యుత్ వృథాను తగ్గించే ఎన్‌లాగ్ స్మార్ట్ డివైజ్.!

by Daayi Srishailam |

విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాక కార్బన్ ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గించింది

23% విద్యుత్ వృథాను తగ్గించే ఎన్‌లాగ్ స్మార్ట్ డివైజ్.!
X

దిశ, ఫీచర్స్: గురుగ్రామ్‌కు చెందిన ఇంజనీర్ భరత్ రంకావత్ అభివృద్ధి చేసిన ఎన్‌లాగ్ డివైస్ విద్యుత్ వృథాను 23% వరకు తగ్గిస్తూ 23000 మందికి పైగా వినియోగదారులకు 4,800 మెగావాట్-అవర్ల విద్యుత్‌ను ఆదా చేసింది. ఈ డివైస్ హోటళ్లు, కమర్షియల్ ఆఫీసులు, రిటైల్ స్పేస్‌లు, గృహాలలో విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాక కార్బన్ ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గించింది.

ట్రాకింగ్ లేకపోవడం వల్లనే..

అవసరం లేకపోయినా లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు వంటివి ఆఫ్ చేయకపోవడం వల్ల గృహాలలో 20-30% విద్యుత్ వృథా అవుతుంది. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాక పర్యావరణ సమస్య కూడా. భరత్ రంకావత్ దీని గురించి తెలుసుకున్నాడు. మెర్సిడెస్-బెంజ్, ఫోర్డ్, కార్‌డెఖో వంటి ప్రతిష్టాత్మక కంపెనీలలో ఇంజినీర్‌గా పనిచేసిన భరత్.. వ్యాపార సంస్థలలో అనిరీక్షిత విద్యుత్ బిల్లు పెరుగుదలను గమనించాడు. పెద్ద వ్యాపార సంస్థలలో 30% వరకు విద్యుత్ వృథా అవుతోంది. ఇది అజాగ్రత్త వల్ల కాదు విద్యుత్ వినియోగాన్ని ట్రాక్ చేసే లేదా ఆప్టిమైజ్ చేసే సాధనాలు లేకపోవడం వల్ల అని గ్రహించాడు.

ఎన్‌లాగ్ డివైజ్..

కరంటు వినియోగాన్ని ట్రాకింగ్, ఆప్టిమైజింగ్ చేసి సమస్యను పరిష్కరించేందుకు భరత్ ఒక స్మార్ట్ డివైస్‌ను రూపొందించాడు. ఇది విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షిస్తూ వృథాను గుర్తించి, ఉపకరణాల పనితీరును ఆప్టిమైజ్ చేస్తుంది. దానిపేరు ఎన్‌లాగ్ డివైజ్. ఇదొక చిన్న పరికరం. 40 x 20 మి.మీ సైజులో ఉంటుంది. రెండు వేరియంట్‌లలో ఇది లభ్యమవుతుంది. స్విచ్‌గా లేదా ఎంసీబీగా దీనిని వాడుకోవచ్చు. దీనిని ఇల్లు లేదా వ్యాపార సంస్థ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. స్విచ్‌బోర్డ్‌ల వెనుక లేదా ఏదైనా ఎలక్ట్రికల్ సెటప్‌లో సీమ్‌లెస్‌గా అమరిస్తే సరిపోతుంది.

రియల్‌టైమ్ మానిటరింగ్

ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ డివైజ్ ఉపకరణాలను ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుంది. అనవసరంగా ఆన్‌లో ఉన్న ఉపకరణాలను ఆఫ్ చేస్తుంది. నిశ్శబ్ద విద్యుత్ లీకేజీలను సరిచేస్తుంది. సెకనుకు 25,000 డేటా పాయింట్లను సేకరించి విశ్లేషిస్తూ కరెంట్, వోల్టేజ్, పవర్ ఫ్యాక్టర్, హార్మోనిక్స్‌ను పర్యవేక్షిస్తుంది. ఈ విశ్లేషణ ఆధారంగా విద్యుత్ వినియోగంలోని అసమర్థతలను గుర్తించి సరిచేస్తుంది. డేటాను సెంట్రల్ సర్వర్‌కు పంపుతూ చిన్న చిన్న సర్దుబాట్లతో విద్యుత్ వ్యవస్థపై మొత్తం లోడ్‌ను తగ్గించి రియల్-టైమ్ మానిటరింగ్ చేస్తుంది. వినియోగ నమూనాలను అర్థం చేసుకుని గరిష్ట ఆదాను అందిస్తుంది.

25 కోట్ల లక్ష్యం

ఎన్‌లాగ్ డివైజ్ ఇప్పటికే హోటళ్లు, కో-లివింగ్ స్పేస్‌లు, కమర్షియల్ ఆఫీసులు, రిటైల్ అవుట్‌లెట్‌లు, గృహాలలో 23,000 మంది యూజర్లకు సేవలందిస్తోంది. దీనిద్వారా 4,800 మెగావాట్-అవర్ల విద్యుత్ ఆదా అయింది. ఇది 1,700 ఇళ్లకు ఒక సంవత్సరం పాటు విద్యుత్ సరఫరా చేయడానికి సరిపోతుంది. ఇంకా 4,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించింది. 2019లో స్థాపించబడిన ఎన్‌లాగ్ గత ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల రూపాయలను లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story