- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ బ్యాంక్ సైజులో ఏఐ సూపర్ కంప్యూటర్.. ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తుంది!
టినీ ఏఐ పాకెట్ ల్యాబ్.. అనే ఈ చిన్న సూపర్ కంప్యూటర్120 బిలియన్ పారామీటర్లతో కూడిన పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను సైతం ఇంటర్నెట్ లేకుండా కూడా ఆఫ్‌లైన్, క్లౌడ్ ద్వారా కూడా వేగంగా నడపగలదు.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు చూడ్డానికి పెద్దవిగా ఉంటాయి. కానీ అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ మాత్రం ప్రపంచంలోనే అతి చిన్న ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటర్‌ను డెవలప్ చేసింది. దీనికి టినీ ఏఐ పాకెట్ ల్యాబ్ (Tiiny AI Pocket Lab) అని పేరు పెట్టింది. పవర్ బ్యాంక్ సైజులో ప్రపంచంలోని ఈ చిన్న AI పరికరం 14.2 × 8 × 2.53 సెం.మీ. పరిమాణంతో 300 గ్రాముల బరువుతో ఉంటుంది. దాని సైజు కారణంగా అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ‘ప్రపంచంలోని చిన్న మినీపీసీ (100B LLM లోకల్‌గా)’ ధృవీకరించబడిందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనివల్ల ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం.
టినీ ఏఐ పాకెట్ ల్యాబ్.. అనే ఈ చిన్న సూపర్ కంప్యూటర్120 బిలియన్ పారామీటర్లతో కూడిన పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను సైతం ఇంటర్నెట్ లేకుండా కూడా ఆఫ్‌లైన్, క్లౌడ్ ద్వారా కూడా వేగంగా నడపగలదు. ఇందులోని ఆర్మ్‌వి9.2 12-కోర్ CPU, 80GB LPDDR5X RAM, 160 TOPS dNPU + 30 TOPS iNPUతో 65W పవర్ ఎన్వలప్‌లో పనిచేస్తుంది. టర్బోస్పార్స్ అండ్ పవర్ ఇన్ఫర్ వంటి టెక్నాలజీల ద్వారా జీపీయూ (GPU)-లెవెల్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. GPT-OSS, లామా, క్వెన్, మిస్ట్రల్ వంటి ఓపెన్-సోర్స్ మోడల్స్‌ను సపోర్ట్ చేస్తూ, డేటా ప్రైవసీ అండ్ బ్యాంక్-లెవెల్ ఎన్‌క్రిప్షన్‌తో క్రియేటర్లు, డెవలపర్లకు ఎంతో ఉపయోగపడుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కొత్తగా డెవలప్ చేసిన ఈ ఏఐ ఆధారిత మినీ కంప్యూటర్ 2026లో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
టినీ ఏఐ పాకెట్ ల్యాబ్ ప్రయోజనాలు :
*పూర్తి ఆఫ్‌లైన్ AI: ఇంటర్నెట్, క్లౌడ్ ఏమీ అవసరం లేకుండా 120 బిలియన్ పారామీటర్ల Llama-3, DeepSeek, Qwen వంటి పెద్ద మోడల్స్ నడుస్తాయి.
*100% డేటా ప్రైవసీ: మీ డేటా ఎక్కడికీ వెళ్లదు. బ్యాంక్-లెవెల్ ఎన్‌క్రిప్షన్ + లోకల్ ప్రాసెసింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.
*పవర్ బ్యాంక్ సైజు పోర్టబిలిటీ: 14×8×2.5 సెం.మీ. సైజుతో 300 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో జేబులో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
*ఎనీ టైమ్ ఏఐ : ఫ్లైట్‌లో, ట్రైన్‌లో, అడవిలో, గ్రామంలో, ఆఫీసులో, ఇంటర్నెట్ లేకపోయినా పూర్తి AI పవర్‌తో నడుస్తుంది.
*తక్కువ ఖర్చు: ఒక్కసారి కొనుక్కుంటే చాలు తర్వాత ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేదు(ChatGPT Plus, Claude, Gemini లాంటివి అవసరం లేదు).
*ఫాస్ట్ రెస్పాన్స్: క్లౌడ్ లేటెన్సీ లేకుండా స్థానికంగా 30–50 టోకెన్స్/సెకన్ వేగం (మోడల్ ఆధారంగా).
*డెవలపర్/క్రియేటర్ ఫ్రెండ్లీ: ఒకే క్లిక్‌తో ComfyUI, Flowise, OpenManus, Ollama వంటి AI ఏజెంట్లు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
*పర్సనల్ AI అసిస్టెంట్: మీ డాక్యుమెంట్స్, ఫోటోలు, ఫైల్స్ అన్నీ లోకల్‌గా ఇండెక్స్ చేసి RAG చాట్‌బాట్‌లా పనిచేస్తుంది.
*ఆఫీసు / ఎడ్యుకేషన్ ఉపయోగం: సెన్సిటివ్ డేటా(Medical, Legal, Financial)తో పనిచేసే వాళ్లకు ఇది సురక్షిత AI అని చెప్పొచ్చు.
*బ్యాటరీ + పవర్ బ్యాంక్‌తో రన్ చేయవచ్చు: 65W వరకు ఉపయోగిస్తుంది కాబట్టి పెద్ద పవర్ బ్యాంక్‌తో కూడా గంటలు నడుస్తుంది.
*OTA అప్‌డేట్స్: కొత్త మోడల్స్, ఫీచర్స్ వై-ఫై ద్వారా ఆటోమేటిక్‌గా వస్తాయి. కావాల్సినప్పుడు మాత్రమే కనెక్ట్ చేయొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మీ జేబులో ఉండే మీ సొంత కంప్యూటర్ + ChatGPT అని చెప్పవచ్చు.






