Viral news : ఉద్యోగం వదిలేసి పాలదందా..! ఆడికారులో పాలు అమ్ముతున్న రైతు!!

by Javid Pasha |   (  Updated:2025-04-29 06:41:24  IST  )

Viral news : ఉద్యోగం వదిలేసి పాలదందా..! ఆడికారులో పాలు అమ్ముతున్న రైతు!!

Viral news : ఉద్యోగం వదిలేసి పాలదందా..! ఆడికారులో పాలు అమ్ముతున్న రైతు!!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పాలదందా చేసేవారు సైకిల్ మీదో, టూ వీలర్‌పైనో తిరుగుతూ పాలను అమ్ముతుంటారు. కానీ ఖరీదైన లగ్జరీ కారులో అమ్మేవారిని ఎప్పుడైనా చూశారా? ఒక రైతు మాత్రం అదే చేస్తున్నాడు. పైగా అతను వాడేది మామూలు వాహనం కూడా కాదు. అత్యంతక ఖరీదైన బ్రాండ్‌గా పేరొందిన ఆడికారు. ఒక రైతు అలా చేయగడా? అని ఎవరికైనా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. ఇంతకీ అతనెవరు? అదెలా సాధ్యమో చూద్దాం పదండి!

అతను సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తే. పేరు అమిత్ భదానా(Amit Bhadana). హరియాణా రాష్ట్రంలోని మొహబ్బతాబాద్ గ్రామానికి చెందినవాడు. కష్టపడి చదివి బ్యాంక్ ఉద్యోగం సంపాదించాడు. కానీ అతని మనసంతా వ్యవసాయం, పాడిపరిశ్రమ మీదే ఉండేదట. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి తన కుటుంబ సంప్రదాయ వృత్తిని కొనసాగించడం మొదలు పెట్టాడు. పశువుల పెంపకంపై మక్కువ ఉన్న అతను ఎక్కువ మొత్తంలో ఆవులను, గేదెలను పెంచడం మొదలు పెట్టాడు. మొదట అతను సైకిల్ మీద, ఆ తర్వాత కొన్ని రోజులకు హార్లే డేవిడ్ సన్ మోటార్ సైకిల్‌పై పాలను అమ్మేవాడు(Dairy business). చుట్టు పక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించాడు. దీంతో అతని వ్యాపారం దిన దినాభివృద్ధి చెందడంతో పాడిపరిశ్రమను విస్తరించాడు.

ఒకప్పుడు మోటార్ సైకిల్ మీద పాలను అమ్మిన అమిత్ భదానా ఇటీవల రూ. 50 లక్షల విలువైన ఆడికారు(Aadi car)లో తిరుగుతూ పాలు అమ్ముతున్నాడు. ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది. అలా అయితే లాభాలెలా వస్తాయి? అని అనుమానం రావచ్చు. కానీ తన వద్ద ఎక్కువ మొత్తంలో పాడిపరిశ్రమ ఉన్నందున ఎలాంటి నష్టం రావడం లేదంటున్నాడు అమిత్ భదానా. పైగా తానలా చేయడంవల్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందని, తన పాలదందాను మరింత విస్తరించానని పేర్కొంటున్నాడు. ఇదేదో గొప్పవాడిని అనిపించుకోవడానికి చేయడం లేదంటున్న అమిత్ భదానా, వ్యాపారానికి ఆధునికతను జోడించడంతోపాటు, చిన్న వ్యాపారాలను తక్కువ అంచనా వేసేవారికి ఏదైనా సాధించగలమనే స్ఫూర్తినివ్వడానికే ఇలా చేశానని చెబుతున్నాడు. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో(marketing.growmatics)వైరల్ అవుతుండగా.. నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.

Next Story