మంచుకొండ‌ల్లో డీజే ట్రిల్లు.. వెంటాడింది ఓ భ‌ల్లు! (వీడియో)

by Disha Web Desk 20 |
మంచుకొండ‌ల్లో డీజే ట్రిల్లు.. వెంటాడింది ఓ భ‌ల్లు! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్రతి ఒక్కరూ విహారయాత్రల్లో మైమ‌రచిపోతుంటారు. ప్ర‌కృతి చూస్తూ, ఆ క్షణాలు, మ‌ధుర జ్ఞాపకాలను ఆనందిస్తుంటారు. అయితే, ఈ ఆనంద క్ష‌ణాల్లో కొన్ని అప్పుడే క‌నిపించ‌వు. అక్క‌డ తీసుకున్న ఫోటోలు, వీడియోలను ఇంటికొచ్చి చూసుకుంటే, అప్పుడు కొన్ని విశేషాలు క‌నిపిస్తాయి. స‌రిగ్గా ఈ పాపుల‌ర్ బ్రెజిలియ‌న్‌ డీజేకు కూడా ఇలాగే జ‌రిగింది. తాను ఫ్రెంచ్ ఆల్ప్స్‌లో స్కీయింగ్ చేస్తున్నప్పుడు అవాక్క‌య్యే ఓ సంఘ‌ట‌న గురించి త‌ర్వాత తెలుసుకున్నాడు. అలోక్ అచ్కర్ పెరెస్ పెట్రిల్లో, ఉర‌ఫ్ DJ అలోక్ విహార‌యాత్ర కోసం కోర్చెవెల్‌కి వెళ్లాడు. అక్క‌డ స్నోబోర్డింగ్ చేస్తున్నప్పుడు ఓ భారీ ఎలుగుబంటి తనను వెంబ‌డిస్తూ వ‌చ్చింది. కొన్ని క్ష‌ణాల వ్య‌వ‌ధిలో డీజే పెట్రిల్లోకి పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. ఆ అనుకోని అనుభ‌వాన్ని పెట్రిల్లో త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నాడు. ఈ వైర‌ల్ వీడియోకు 60 లక్షలకు పైగా వ్యూవ్స్ రాగా, 5.5 లక్షలకు పైగా లైక్‌లు, 7,000 పైగా వ్యాఖ్యలతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.


Next Story

Most Viewed