- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ.. రంగంలోకి మాస్టర్ చెఫ్.. ఒక్క కిస్ అంటూ షాకింగ్..
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్ కథే. అయితే ఆడియో లీక్ లేదంటే ట్రోలింగ్ వీడియోస్ స్క్రోల్ చేయాల్సి వస్తుంది. మొత్తానికి ఇన్‌ఫ్లుయెన్సర్లు అంతా

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్ కథే. అయితే ఆడియో లీక్ లేదంటే ట్రోలింగ్ వీడియోస్ స్క్రోల్ చేయాల్సి వస్తుంది. మొత్తానికి ఇన్‌ఫ్లుయెన్సర్లు అంతా పచ్చళ్లను పగబట్టినట్లు ఒకటే రివ్యూలు ఇచ్చేస్తున్నారు. వీళ్లకు మద్దతిచ్చిన నా అన్వేషణ అన్వేష్‌ను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మ కూడా తన టర్న్ వచ్చేసిందన్నట్లు.. ఇండైరెక్ట్‌గా ఈ ఇష్యూని క్రిటిసైజ్ చేస్తూ పచ్చళ్లు తినండి బూతులు కాదు అంటూ యూత్‌కు మంచి మెసేజ్ ఇచ్చాడు.
‘‘బ్రెస్ట్ చూపించి పికిల్స్ అమ్మేస్తున్నారు. నిజానికి చికెన్ బ్రెస్ట్‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పచ్చడి షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నాన్ వెజ్ పికిల్స్ మీరే చేసుకోండి. మీరే తినండి. బూతులు తినకండి. ఒక్క కిస్.. ఒక్క కిస్ ఏంట్రా బాబు ఒక్క పీస్...’’ అంటూ ఇండైరెక్ట్‌గా పచ్చళ్ల అలేఖ్యను బాగానే విమర్శించాడు. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు తమ పని తాము చేస్తూనే ఇలా కూడా విమర్శించవచ్చనేది ఈయనని చూశాకే బోధపడింది సుమీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
🤣🤣🤣🤣#alekhyachittipickles #alekhyaachittipickles #AlekyaChittiPickles #AlekhyaChitti #AlekhyaChittiPicklesIssue #Alek pic.twitter.com/WJHrAM5ikI
— Sontosh Kumar (@KnightsSontosh) April 6, 2025






