నేర్చుకో విద్యార్థి.. డిజిటల్ "శిక్ష".!

by Daayi Srishailam |   (  Updated:2025-12-25 07:18:41  IST  )

అక్షయ్ మషెల్కర్ "శిక్ష" అనే హ్యుమనాయిడ్ రోబోను తయారుచేశాడు

నేర్చుకో విద్యార్థి.. డిజిటల్ శిక్ష.!
X

దిశ, ఫీచర్స్: ఇది డిజిటల్ యుగం. అయినప్పటికీ ఇంకా చాలా గ్రామాలు డిజిటల్ అభ్యసనానికి దూరంగా ఉన్నాయి. బ్లాక్‌బోర్డు.. చేత్తో తయారు చేసిన చిత్రాలతోనే బోధన సాగుతోంది. ఒక సబ్జెక్టుకు స్పెషల్ టీచర్ ఉండరు. ఒకే టీచర్ మ్యాథ్స్.. సైన్స్.. ఇంగ్లీష్ చెప్తారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న కర్ణాటకకు చెందిన అక్షయ్ మషెల్కర్ "శిక్ష" అనే హ్యుమనాయిడ్ రోబోను తయారుచేశాడు.

టీచింగ్ అసిస్టెంట్..

గ్రామీణ విద్యార్థుల్లో నూతనత్వాన్ని తీసుకు రావడమే "శిక్ష" ఉద్దేశం. వనరులు తక్కువగా ఉన్న చోట కూడా అభ్యసనం మెరుగ్గా ఉండేందుకు ఉపయోగపడే హ్యూమనాయిడ్ టీచింగ్ అసిస్టెంట్ ఇది. సిలబస్‌లోని పాఠాలనే ఆసక్తికరంగా చెప్పే లక్ష్యంతో దీనిని రూపొందించాడు అక్షయ్. దీనికోసం సంవత్సరంన్నర కష్టపడ్డాడు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టాడు. "శిక్ష" సాధారణ యంత్రమేం కాదు. ప్రోగ్రామ్ చేసిన కార్డులకు స్పందిస్తూ కన్నడ.. ఇంగ్లిష్.. మ్యాథమెటిక్స్ పాఠాలు అందించే సామర్థ్యం దీనికుంది. ఒక కార్డుతో ఆన్ చేసి మరో కార్డుతో నిర్దిష్ట పాఠం ప్రారంభిస్తుంది.

25 పాఠశాలల్లో..

"శిక్ష".. పఠనం.. ప్రశ్నలు.. కవితల ద్వారా పిల్లలను ఆకర్షిస్తుంది. సమాచారం ఇవ్వడం ఒక్కటే కాదు. ఇంటరాక్ట్ కూడా అవుతుంది. తరగతిలోని విద్యార్థులు సబ్జెక్టులో లీనమయ్యేలా.. ఆసక్తికరంగా బోధన సాగుతుంది. నిష్క్రియాత్మక బోధనకు బదులు.. చురుకైన భాగస్వామ్యం కలిగి ఉండేలా "శిక్ష" ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఉత్తర కన్నడ జిల్లాలో 25కు పైగా పాఠశాలల్లో "శిక్ష" పనిచేస్తోంది. రోబో సెషన్ నడిపిస్తుంతసేపు పిల్లలు శ్రద్ధగా.. ఉత్సాహంగా వింటున్నారు. దీనివల్ల టీచర్లకు కూడా కొంత బోధన భారం తగ్గుతుంది. సిబ్బంది తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఇది పెద్ద మార్పు తీసుకొచ్చింది.

సమగ్ర విద్యకు..

స్మా్ర్ట్ ఇంజినీరింగ్.. తక్కువ ధర మాత్రమే "శిక్ష" స్పెషాలిటీ కాదు. రిపిటీషన్ సామర్థ్యం కూడా దీనికుంది. స్థానికంగా లభించే భాగాలతో తయారు చేయడం.. అడాప్టబుల్ కంటెంట్ ఫార్మాట్ ఉండటంతో దేశమంతా విస్తరించే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా ప్రాథమిక తరగతుల్లో బేసిక్ అభ్యసనానికి ఇది ఉపయోగపడుతుంది. సమగ్ర శిక్షా అభియాన్.. డిజిటల్ ఇండియా.. పీఎం ఈ-విద్య వంటి కార్యక్రమాలకు ఇలాంటి ప్రాథమికస్థాయి పరిష్కారాలు సహకారం అందిస్తాయి. సమగ్ర విద్యను అందించాలనే ప్రయత్నంలో శిక్షను మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Read More..

చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం.. చట్టాన్ని తీసుకొచ్చిన శ్రేయ నల్లమోతు.!

Next Story