- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Passengers Weight: ఇది మరి ఘోరం భయ్యా.. బరువు ఎక్కువుంటే డబ్బులు విమాన ఛార్జీలు ఎక్కువ చెల్లించాలా?
Passengers Weight: విమానం ఎక్కే ముందు మన లగేజీ బరువును చేయడం అందరికీ తెలిసిందే.

Passengers Weight: విమానం ఎక్కే ముందు మన లగేజీ బరువును చేయడం అందరికీ తెలిసిందే. విమాన ప్రయాణీకుల లగేజీ ఎక్కువగా ఉంటే బరువు తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేదంటే కొన్ని సందర్బాల్లో పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇక నుంచి ఫ్లైట్ ఎక్కే ముందు మీ లగేజీ బరువు మాత్రమే కాదు..మీ బరువు కూడా చెక్ చేసుకోవాలి. అవును నిజమే. ప్లస్ సైజ్ ప్రయాణీకులు అదనపు సీట్లు కొనుగోలు చేయాల్సిన లేదా వారి సైజుకు అనుగుణంగా అధిక ఛార్జీలు చెల్లించాల్సిన విధానాలను విమానయాన సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఈ విధానం లిమిట్ సీట్స్ సమస్యను పరిష్కరించడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందించండం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అర్మ్ రెస్ట్ లను క్రిందికి ఉంచి ఒకే సీటు సరిపోకుంటే ప్రయాణికులు అదనపు సీటును కొనుగోలు చేయాలని కొన్ని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి.
విమానాయన సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రయాణికుల సైజు ఆధారంగా ఛార్జ్ వేయడం వివక్షత, అవమానీయత అని విమర్శిస్తున్నారు. ప్లస్ సైజ్ ఇన్ఫ్లుయెన్సర్లు, న్యాయవాదులు సైతం ఈ విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణీకులందరు సమానమేనని బరువు ఎక్కువగా ఉంటే ఎక్కువ ఛార్జీలు, తక్కువగా ఉంటే తక్కువ ఛార్జీలు విధించడం సరికాదంటున్నారు. వ్యక్తుల శరీరం పరిమాణాన్ని శిక్షించరాదని..విమానయాన సంస్థలు ప్రయాణీకులకు ప్రయాణం మరింత సానుకూలంగా ఉండేలా దృష్టి పెట్టాలంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం పెరిగిపోతుండటంతో విమానయాన సంస్థలు సహా పలు పరిశ్రమలు వారికి మెరుగైన వసతి కల్పించడానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని విమానయాన సంస్థలు సీట్ బెల్ట్ ఎక్స్ టెండర్లను అందిస్తున్నాయి. ప్రయాణీకులకు డిస్కౌంట్ ధరలకు అదనపు సీట్లను కొనుగోలు చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నాయి. అదనంగా కొన్ని క్యారియర్లు ప్లస్ సైజ్ ప్రయాణీకులు నిర్దిష్ట ప్రయాణాలకు అనుగుణంగా ఉంటే డొమెస్టిక్ ఫ్లైట్లలో ఫ్రీగా ఎక్స్ ట్రా సీట్లకు అనుమతి ఇస్తున్నాయి.
అయితే ప్రయాణికుల బరువుపై అదనపు ఛార్జీలు చెల్లించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రయాణీకుల హక్కులు, సౌకర్యాలను కల్పించడంతోపాటు ప్రయాణికుల అవసరాలను సమతుల్యం చేయడంపై విమానయాన సంస్థలు దృష్టి సారించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.






