- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air Pollution : గర్భిణులపై ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్.. పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందా?
Air Pollution : గర్భిణులపై ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్.. పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందా?

దిశ, ఫీచర్స్ : వాయు కాలుష్యం సహజంగానే పలు అనారోగ్యాలకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు, గుండెపోటు, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ డిసీజ్ వంటి ప్రమాదాలను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే గర్భిణులపై కూడా ప్రభావం చూపడం ద్వారా అది పుట్టబోయే పిల్లల్లో పలు శ్వాసకోశ వ్యాధులకు కారణం అవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం.
వాయు కాలుష్యం గర్భిణులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి నార్వేలోని బెర్గెన్ యూనివర్సిటీ(The University of Bergen)కి చెందిన రీసెర్చర్స్ పరిశోధనలు నిర్వహించారు. అధ్యయనంలో భాగంగా వీరు మొత్తం 5000 కంటే ఎక్కువ మంది గర్భిణుల, అలాగే వారికి పుట్టిన పిల్లల రెస్పిరేటరీ డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా పరిశోధకులు తరచుగా ఎయిర్ పొల్యూషన్‌కు గురవుతున్న గర్భిణులు తక్కువ బరువుగల బిడ్డకు జన్మనిస్తున్నారని, ఆ శిశువుల్లో ఎదుగుదల లోపాలు ఉంటున్నాయని గుర్తించారు. అట్లనే వాయు కాలుష్యం లేని ప్రాంతాల్లో, పచ్చని చెట్లు ఎక్కువగా ఉండే పరిసరాల్లో నివసించే గర్భిణులకు జన్మించిన పిల్లలతో పోలిస్తే, వాయు కాలుష్యానికి గురవుతున్న గర్భిణులకు జన్మించే శిశువులు 26 నుంచి 31 గ్రాముల తక్కువ బరువు ఉంటున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా వాయు కాలుష్యానికి గురయ్యే తల్లులకు పుట్టిన శిశువుల్లో వయసు పెరిగే కొద్దీ ఆస్తమా లేదా క్రానిక్ అబ్‌స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజెస్ (COPD) వంటి శ్వాసకోశ వ్యాధులు డెవలప్ అయ్యే రిస్క్ అధికంగా ఉంటున్నట్లు నిర్ధారించారు. కాబట్టి గర్భధారణ సమయంలో తల్లులు వాయుకాలుష్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






