ChatGPT.. ఫెమినిస్టా?

by Disha Web Desk 6 |
ChatGPT.. ఫెమినిస్టా?
X

దిశ, ఫీచర్స్: ChatGPT.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మానవ జీవితంలో భాగమైపోనుంది. సేవలలో గూగుల్‌ను మించిపోతుందన్న సమాచారంతో ప్రస్తుతం సంచలన అంశంగా మారింది. చర్చకు దారి తీసింది. అయితే చాట్‌జీపీటీ ఇన్ఫర్మేషన్ హబ్‌గానే కాకుండా లింగ అసమానతలను రూపు మాపడానికి ఏ విధంగా తోడ్పడుతుందో కూడా తెలుసుకునేందుకు టెక్నాలజీ నిపుణులు, ఫెమినిస్టు మేధావులు ప్రయత్నించారు. ఇందుకోసం పలు ప్రశ్నల చాట్‌ను రూపొందించారు. 'చాట్ జీపీటీ మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సమ్యలను ఎలా ప్రతిబింబిస్తుంది? ఏ విధంగా పరిష్కరిస్తుంది? చాట్‌జీపీటీ ఫెమినిస్టా? MeToo ఉద్యమానికి సహకరిస్తుందా? ఇందులో ఫెమినిస్టులకు సంబంధించిన టెక్నికల్ సపోర్టింగ్ ఇమిడి ఉందా?' అనే ప్రశ్నలను సిలికాన్ వ్యాలీ టెక్నికల్ విభాగం నిపుణులు చాట్‌జీపీటీని అడిగినప్పుడు ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ వచ్చింది. 'టెక్నాలజీ ఫెమినిస్టు కాగలదు. ఫెమినిస్టులకు అండగా నిలువగలదు' అనే సమాధానాన్ని డీకోడ్ చేసింది.

పితృస్వామ్యంపై ChatGPT

'ఫెమినిస్టుగా ఉండడమంటే.. స్త్రీల హక్కులు, అవకాశాలు, బాధ్యతల గురించి మాట్లాడడం, అవగాహన కలిగి ఉండటం. లింగ అసమానతను, వివక్షను రూపుమాపడం, సమానత్వం దిశగా ప్రయత్నాలు చేయడం. ఒక విధంగా చెప్పాలంటే పితృస్వామ్య భావజాలాన్ని తిరస్కరించడం' అనే సమాచారాన్ని అందించింది చాట్‌జీపీటీ. మహిళల సమస్యల పరిష్కారంలో ఏఐ కూడా మనుషుల్లా పక్షపాతాన్ని వ్యక్తీకరించడం, సమస్యను పరిష్కరించే సమాచారాన్ని కలిగి ఉండటం, సోర్సును క్రోడీకరించడం చేస్తుంది. అదే సందర్భంలో ఏఐ అల్గారిథమ్‌లలో లింగ వివక్ష, జాతి పక్షపాతం అంశాలపై సమాచారం కూడా నిమిడి ఉన్నట్లు తెలుస్తోంది.

మీటూ ఉద్యమ కోణంలో..

'చాట్‌జీపీటీ మహిళలకు ఏ విధంగా అండగా నిలువగలదు. దాని టెక్నాలజీ ఎలా ప్రతి స్పందిస్తుంది?' తదితర సందేహాలను తీర్చుకోవడానికి నిపుణులు పలు ప్రశ్నలను తయారుచేశారు. ఇందులో ఫస్ట్ పేరాలో 'చాట్ జీపీటీ ఫెమినిస్టా?' అని తెలుసుకోవడానికి డీ కోడ్ చేశారు. మీటూ ( #MeToo) ఉద్యమం విషయంలో ఏఐ టెక్నాలజీని పరీక్షించే ఉద్దేశంతో పలు ప్రశ్నలను సంధించారు. ఈ సందర్భంలో చాట్‌జీపీటీ సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ఏఐ ప్రకారం.. మీటూ ఉద్యమం గురించి, కంపెనీలు, పలు సంస్థల్లో మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, కేసులు వంటి విషయాలపై స్పందించిన తీరు, సమాచారాన్ని అందించింది. సమాజంలో మార్పు అవసరం గురించి పలు ఇంపార్టెంట్ డైలాగ్‌లను ఏఐ టెక్నాలజీ ప్రదర్శించింది.

దాడులకు గురైన మహిళా బాధితులకు అండగా నిలువడం, ఆధిపత్య సంస్కృతిని తిరస్కరించడానికి తోడ్పడగలదని ఏఐ టెక్నాలజీ పేర్కొన్నది. అంతేకాదు బాధితులు ఎక్కడ న్యాయం పొందగలరు? అని ప్రశ్నించినప్పుడు తగిన సమాధానం చెప్పడంతోపాటు ఆధిపత్య సంస్కృతిని, మహిళలపై వ్యతిరేక వైఖరిని, నిబంధనలను సవాల్ చేయడం తప్పనిసరి అని కూడా వెల్లడించింది. ఇలాంటి ఉద్యమానికి అండగా నిలవడం ద్వారా భద్రత కలిగిన సమాజం కోసం పనిచేయవచ్చని తెలిపింది. ప్రపంచంలో మహిళల తరఫున వాదించగలిగే, వారి బాధలను వినగలిగే నాయకులు ఉన్నట్లు ఏఐ టెక్నాలజీ సమాధానాలిచ్చింది. అంతేకాకుండా మహిళల విషయంలో దౌర్జన్యంగా వ్యవహరించే వారిని తిరస్కరించడం.. స్త్రీలు తమ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి చక్కటి సలహాలు ఇవ్వడం.. సలహా ఇచ్చే ప్రచారకర్తలు, నిపుణుల ద్వారా సమాధానాలు రాబట్టడం వంటి అంశాలను ఏఐ టెక్నాలజీ కలిగి ఉంది.

ఏఐ టెక్నాలజీ ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. చాలామంది పురుషులు మీ టూ (#MeToo) ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. మహిళల సమస్యలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి, ప్రాణాలు కాపాడటానికి, వారి తరఫున వాదించడానికి తోడ్పడుతున్నారు. అయితే అదే సందర్భంలో పురుషులందరూ ఫెమినిస్టు ఉద్యమానికి అండగా ఉండలేరని కూడా వివరించింది. కొందరు భిన్న వైఖరులు, నమ్మకాలు కలిగి ఉంటున్నారని చాట్ జీపీటీ తెలిపింది. లైంగిక వేధింపుల గురించి మాట్లాడటానికి, చర్చల్లో పాల్గొనడానికి సామాజిక స్పృహ కలిగినవారు ఆసక్తి చూపుతుండగా.. కొందరు మాత్రం పట్టనట్లుగా ఉంటున్నారని వెల్లడించింది. మహిళలను ఇబ్బందికి గురిచేసే విష సంస్కృతిని వ్యతిరేకించాల్సిన అవసరాన్ని కూడా ఏఐ టెక్నాలజీ ప్రస్తావిస్తోంది.

పురుషులకు సలహా

'మహిళలకు అండగా మీ టూ లాంటి ఉద్యమాల్లో పురుషులు ఎలా పాల్గొనవచ్చు?' అనే ప్రశ్నకు స్పందించింది. ఫెమినిస్టులు లేదా మహిళల తరఫున వాయిస్ వినిపించవచ్చు. ఉద్యమంలో మంచి మిత్రులుగా కొనసాగవచ్చు. మహిళలపై విద్వేష పూరితమైన కుట్రలను, ప్రచారాలను, పితృస్వామ్య వైఖరులను సవాలు చేయవచ్చు అని తెలిపింది. లైంగిక వేధింపుల విషయంలో సహకారం అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అయితే సమస్యల విషయంలో ఎవరికి వారు అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని వెల్లడించింది.

Also Read..

కుక్క దాడిలో పెదవి కోల్పోయిన 23 ఏళ్ల మోడల్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?



Next Story

Most Viewed