స్త్రీలను చిన్న చూపు చూస్తున్న చాట్ జీపీటీ.. పురుషులకంటే తక్కువ జీతాలు ఇవ్వాలంటూ సలహాలిస్తూ.. !

by Javid Pasha |

స్త్రీలను చిన్న చూపు చూస్తున్న చాట్ జీపీటీ.. పురుషులకంటే తక్కువ జీతాలు ఇవ్వాలంటూ సలహాలిస్తూ.. !

స్త్రీలను చిన్న చూపు చూస్తున్న చాట్ జీపీటీ.. పురుషులకంటే తక్కువ జీతాలు ఇవ్వాలంటూ సలహాలిస్తూ.. !
X

దిశ, ఫీచర్స్ : కొన్నిసార్లు ఇతరులను చిన్న చూపు చూడటం, జెండర్‌ను బట్టి వివక్ష ప్రదర్శించడం వంటి ధోరణులు సమాజంలో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా స్త్రీ, పురుషుల సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ విషయానికి వస్తే ఇప్పటికీ పురుషాధిక్య భావజాలమే డామినేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంలోనూ అదే ధోరణి కనిపిస్తోందని జర్మనీలోని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ వుర్జ్ బర్గ్ - ష్వీన్‌ఫర్ట్‌లో ఏఐ అండ్ రోబోటిక్స్ ప్రొఫెసర్ ఇవాన్ యమ్ష్చికోవ్ నేతృత్వంలో జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. చాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సైతం పురుషాధిక్య భావజాలంతో వ్యవహరిస్తున్నట్లు తేలింది.

స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్ సేమ్ టు సేమ్ ఉన్నప్పటికీ, వివిధ ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో సలహాలు అడిగితే.. పలు లాంగ్వేజ్ మోడల్స్ భిన్నంగా స్పందిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా స్త్రీలు పురుషులకంటే తక్కువ జీతాలు కోరాలని చాట్జీపీటీ వంటి ఏఐ ఆధారిత లాంగ్వేజ్ మోడల్స్ సలహాలు ఇస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా వారు GPT-4o మినీ, క్లాడ్ 3.5 హైకు, క్వెన్ 2.5 ప్లస్, మిస్ట్రాల్ 8x22B, అలాగే లామా 3.1 8B వంటి ఐదు ప్రముఖ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ స్త్రీ, పురుషులకు ఇచ్చే సలహాలను పరీక్షించారు.

డిఫరెంట్ జెండర్స్, జాతులు, సీనియారిటీ స్థాయిలతో కూడిన పర్సనల్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసి జాబ్ ఇంటర్వ్యూలలో సాలరీ రిక్వెస్ చేసే విషయమై పరిశోధకులు చాట్ జీపీటీని, ఇతర మోడల్స్‌ను సలహాలు అడిగారు. అయితే 87.5% సందర్భాలలో ‘మేల్ ఆసియన్ ఎక్స్‌పాట్(Asian expat’కు ‘ఫిమేల్ హిస్పానిక్ రెఫ్యూజీ’ కంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలని ఏఐ ఆధారిత లాంగ్వేజ్ మోడల్స్ సిఫార్సు చేశాయి. ఇది జెండర్, అలాగే జాతి ఆధారిత వివక్షను సూచిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

లా అండ్ మెడిసిన్ వంటి రంగాలలో కూడా సాలరీ అడ్వైజింగ్ విషయంలో చాట్ జీపీటీ వంటిఏఐ ఆధారిత లాంగ్వేజ్ మోడల్స్ ఇస్తున్న సలహాల్లో వ్యత్యాసాలను పరిశోధకులు గుర్తించించారు. అయితే సామాజిక శాస్త్రాలలో మాత్రం స్త్రీ, పురుషులకు దాదాపు ఒకే విధమైన సలహాలు ఇవ్వబడ్డాయి. కెరీర్ ఎంపికలు, ఉద్యోగాలు, లక్ష్యాలు, బిహేవియర్స్ వంటి అంశాల్లో మాత్రం స్త్రీలపట్ల లింగ ఆధారిత వివక్షను ఏఐ ఆధారిత లాంగ్వేజ్ మోడల్స్ ప్రదర్శిస్తున్నాయి. ఈ ధోరణి మోడల్స్ ట్రైనింగ్ డేటాలోని చారిత్రక, సంప్రదాయ భావజాల వివక్షల నుంచి అవి గ్రహించాయని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి LLMsను ఉపయోగించే వ్యక్తులు, ముఖ్యంగా ఉద్యోగాలు, కెరీర్ వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తిగా చాట్ జీపీటీ వంటి లాంగ్వేజ్ మోడల్స్‌పైనే ఆధారపడినప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. LINK

Next Story