- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడికల్ టెస్టులకోసం హాస్పిల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఏఐ బూత్‌కి వెళ్తే చాలు!
ఏఐ మెడికల్ బూత్‌లోకి వెళ్లి అనారోగ్య లక్షణాలను ఎంటర్ చేస్తే చాలు.. 4 నిమిషాల్లోనే డయాగ్నోసిస్ రిపోర్ట్ వచ్చేస్తుంది.

దిశ, ఫీచర్స్ : బ్లడ్ ప్రెజర్ ఎలా ఉంది? హార్ట్ బీట్ నార్మలేనా? శరీరంలో కనిపిస్తున్న అనారోగ్య లక్షణాలకు కారణం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనమైతే ఏం చేస్తాం? ఏ హాస్పిటల్‌కో వెళ్లి నిర్ధారణకోసం మెడికల్ టెస్టులు చేయించుకుంటాం. కానీ చైనాలోని షాంఘై నగరంలో అలా కాదు. ఇక్కడివారిలో చాలా మంది మెట్రో స్టేషన్లలోని ఏఐ మెడికల్ బూత్‌లకు వెళ్తారు. తాము ఎదుర్కొంటున్న లక్షణాలు ఏమిటో ఎంటర్ చేయగానే అక్కడున్న టెక్నాలజీ ఆటోమేటిగ్గా బేసిక్ వైటల్స్ చెక్ చేసి రెండు మూడు నిమిషాల్లోనే డయాగ్నోసిస్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అంటే సాధారణ సమస్యలకు సైతం ఆస్పత్రులకు వెళ్లి, గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఏఐ సాంకేతికత తెచ్చిన మరో అద్భుతమైన సౌకర్యమే ఈ మెడికల్ బూత్ విప్లవం అంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇంతకీ అదెలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ విధంగా పనిచేస్తుంది?
షాంఘైలోని ఏఐ మెడికల్ బూత్స్‌లో Ping An Good Doctor అనే కంపెనీ అభివృద్ధి చేసిన మెడికల్ ఏఐ సిస్టమ్స్ ఉపయోగిస్తారు. వీటిలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ & IoT సెన్సార్స్ కలిసి పని చేస్తాయి. అంటే ఇవి సుమారు 30 కోట్ల గత మెడికల్ కేసుల డేటాబేస్‌తో శిక్షణ పొంది ఉంటాయి.. కాబట్టి జలుబు, తలనొప్పి, అలర్జీ, స్కిన్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెజర్ వంటి సాధారణ అనారోగ్యాలను గుర్తించడలో 95% కచ్చితత్వంతో ప్రైమరీ డయాగ్నోసిస్ ఇస్తాయి. 2018 నుంచి పైలట్‌గా మొదలైన ఈ సాంకేతికత 2025-26లో షాంఘై నగరంలో భారీగా విస్తరించింది. హాస్పిటల్స్‌లో రద్దీ తగ్గించడం, సాధారణ సమస్యలకు సైతం డాక్టర్ల సమయం వృథా కాకుండా చేయడం ఈ టెక్నాలజీ అసలు లక్ష్యమని దానిని డెవలప్ చేసిన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏఐ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ, దానిని లైసెన్స్ పొందిన డాక్టర్ రిమోట్‌గా సమీక్షించి, చికిత్స లేదా రెఫరల్ గురించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు.అంటే టెక్నాలజీ వేగంగా రిపోర్ట్ ఇస్తుంది కానీ, బాధ్యత, నమ్మకం డాక్టర్ల వద్దే ఉంటాయన్నమాట. రిపోర్ట్‌లోని విషయాలను, అవసరాన్ని బట్టి డాక్టర్లను సంప్రదించవచ్చు.
అంతటా అందుబాటులోకి వస్తే..
షాంఘైలోని మెడికల్ ఏఐ(AI) బూత్స్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అందుబాటులోకి వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ డాక్టర్ల కొరత ఎక్కువగా ఉంది. కాబట్టి ఏఐ మెడికల్ బూత్ సిస్టమ్స్ వస్తే సాధారణ అనారోగ్యాలను త్వరగా గుర్తించి, పెద్ద హాస్పిల్స్‌లలో రద్దీ తగ్గించవచ్చు. కానీ అందుకోసం డేటా ప్రైవసీ, రూరల్ ఏరియాల్లో ఇంటర్నెట్ సమస్యలు వంటివి ముందుగా పరిష్కరించబడాలి. డాక్టర్ల రివ్యూ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. ఒకవేళ సరైన ప్లానింగ్‌తో అమలు చేస్తే భారతదేశంలోనూ ఏఐ బూత్‌లవంటి ఆధునిక సాంకేతికతతో ఆరోగ్య సేవలు మరింత త్వరగా, సులభంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏఐ బూత్ వ్యవస్థ అనేది టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌గా డెవలప్ అవుతుందో, మానవులకు ఎలాంటి కంఫర్ట్‌ను ఇస్తుందో తెలియజేస్తున్నప్పటికీ.. మనుషుల పాత్ర, ప్రాముఖ్యత కూడా ఇక్కడ చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
ప్రయోజనాలు
షాంఘైలోని ఏఐ బూత్ వ్యవస్థతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సాధారణ అనారోగ్య సమస్యల నిర్ధారణకు సైతం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏఐ బూత్‌లోకి వెళ్తే చాలు. 4-8 నిమిషాల్లో డయాగ్నోసిస్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ప్రస్తుతం అక్కడి ఆస్పత్రుల్లో ప్రజల రద్దీ, వెయిటింగ్ టైమ్ 70%, ఖర్చు 30% తగ్గింది. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది. పైగా ఈ సాంకేతికత ఇండియా సహా అన్నిదేశాల్లో అందుబాటులోకి వస్తే డాక్టర్లు, ఆస్పత్రుల కొరత వల్ల తలెత్తే సమస్యలు తగ్గుతాయని, ఈ సాంకేతికత ప్రజలకు సౌకర్యాన్ని అందిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






