తల, మెడ క్యాన్సర్లకు సరికొత్త ట్రీట్‌మెంట్.. అందుబాటులోకి న్యూ రేడియేషన్ థెరపీ

by Disha Web Desk 6 |
తల, మెడ క్యాన్సర్లకు సరికొత్త ట్రీట్‌మెంట్.. అందుబాటులోకి న్యూ రేడియేషన్ థెరపీ
X

దిశ, ఫీచర్స్: క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం ఇప్పటికే పలు రేడియేషన్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే తల, మెడ వంటి సున్నితమైన ప్రాంతాల్లో వాటి పనితీరు అంత సమర్థవంతంగా ఉండట్లేదు. కానీ ప్రజెంట్ అందుబాటులోకి వచ్చిన కొత్త రేడియేషన్ థెరపీ ఐఎంఆర్‌టితో(Intensity-modulated radiation therapy) ఆ పరిస్థితి పోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అతిచిన్న క్యాన్సర్ కణాలను అధునాతన ఐఎంఆర్‌టి రేడియేషన్ ద్వారా సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయవచ్చు. పైగా ఈ థెరపీలో క్యాన్సర్ గడ్డల షేప్‌కు సరిపోయేలా ఆకారంలో ఫోకస్ చేసేందుకు అనుకూలమైన టెక్నాలజీ ఇమిడి ఉంటుంది.

కొన్ని రకాల క్యాన్సర్లు సాధారణంగా గొంతు, నోరు లేదా వాయిస్ బాక్స్‌లో ప్రారంభం అవుతాయి. ప్రజెంట్ వరల్డ్ వైడ్‌గా 7వ అత్యంత సాధారణ క్యాన్సర్లలో తల, మెడ క్యాన్సర్లు ఉన్నాయి. ఇక భారతదేశంలో అయితే ఇవి రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్లుగా ఉన్నాయి. పెదవులు, నోటి కుహరం క్యాన్సర్లు కూడా ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి. కొత్త రేడియేషన్ థెరపీ అనేది శరీరంలో క్యాన్సర్ కణాలు ఎక్కడున్నా కచ్చితంగా గుర్తించి విచ్ఛిన్నం చేయగల మెరుగైన చికిత్స. అంతేగాక బాడీలోని ఇతర ఆరోగ్యకరమైన అవయవాలు, కణజాలాలను కాపాడుతూ, క్యాన్సర్ కణాలను మాత్రమే చంపడానికి లేదా వాటి సంఖ్యను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేగాక ఇది ఔట్ పేషెంట్ ట్రీట్‌మెంట్‌ విధానంలో తక్కువ ఖర్చుతో ప్రయోజనం పొందగలిగే అధునాతన వైద్య చికిత్సగా పేర్కొనవచ్చు.


Next Story

Most Viewed