Health : చిన్న పనికే అలసిపోతున్నారా? అడ్రినల్ ఫెటీగ్‌ కావచ్చు..!

by Javid Pasha |   (  Updated:2025-05-06 13:38:29  IST  )

Health : చిన్న పనికే అలసిపోతున్నారా? అడ్రినల్ ఫెటీగ్‌ కావచ్చు..!

Health : చిన్న పనికే అలసిపోతున్నారా? అడ్రినల్ ఫెటీగ్‌ కావచ్చు..!
X

దిశ, ఫీచర్స్ : అడ్రినల్ ఫెటీగ్‌.. ఈ మధ్య చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ‘అడ్రినల్ ఫెటీగ్(Adrenal fatigue)’ ఒకటి. ఒకప్పుడు పెద్దల్లోనే కనిపించే ఈ ప్రాబ్లం ఇప్పుడు యువతను కూడా ఇబ్బంది పెడుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శారీరక బలహీనత, తరచుగా నీరసం, కొంచెం శారీరక శ్రమ చేయగానే తీవ్రమైన అలసటకు గురికావడం ఈ వ్యాధి ప్రత్యేకత. మూత్ర పిండాలపై భాగంలో ఉండే అడ్రినల్ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోవడంవల్ల ఈ అడ్రినల్ ఫెటీగ్ లేదా అడ్రినల్ ఎగ్జాస్షన్ అనే ఆరోగ్య సమస్య తలెత్తుతుంది.

లక్షణాలు

తీవ్రమైన అలసట, అధికంగా మానసిక ఒత్తిడి(mental stress), నిద్రలేమి, తీపి, ఉప్పగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తినడం, బద్ధకం ఆవహించడం, మహిళల్లో అయితే ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, మెనోపాజ్ సమయంలో బ్లడ్ ప్రెషర్ వంటివి కూడా ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో అడ్రినల్ గ్లాండ్స్ శరీర అవసరాలను తీర్చడంలో సరిగ్గా స్పందించవు.

నివారణ

కొన్ని రకాల ఆహారాలు, మందుల ద్వారా ఈ సమస్య తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పోంతోతేనిక్ యాసిడ్‌గా(Pantothenic acid) పిలువబడే ఆహారం (విటమిన్ B5) దీనిని నివారిస్తుంది. విటమిన్ B6, విటమిన్ సి లభించే ఆహారాలు కూడా నాడీ వ్యవస్థను ఉత్తేజ పరిచి, ఒత్తిడిని దూరం చేయడంవల్ల అడ్రినల్ ఫెటీగ్‌ను తగ్గిస్తాయి.

Next Story