- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంతకు మించిన దరిద్రం ఉండదు.. స్నానం చేసిన నీటిని అమ్ముతున్న ప్రముఖ నటి.. ఎగబడి కొంటున్న ఫ్యాన్స్.. మరీ ఇంతకు తెగించాలా??
యూఫోరియా, ఎనీవన్ బట్ యూ ఫేమ్ సిడ్నీ స్వీనీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే నటనలోనే కాదు బిజినెస్‌లోనూ రాణించాలనుకున్న భామ.. యూనిక్ ఆలోచనతో ముందుకొచ్చింది. స్నానపు నీటిని సబ్బుగా మార్చి అమ్ముతూ సక్సెస్ అయింది. పురుషుల సహజ

దిశ, ఫీచర్స్: యూఫోరియా, ఎనీవన్ బట్ యూ ఫేమ్ సిడ్నీ స్వీనీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే నటనలోనే కాదు బిజినెస్‌లోనూ రాణించాలనుకున్న భామ.. యూనిక్ ఆలోచనతో ముందుకొచ్చింది. స్నానపు నీటిని సబ్బుగా మార్చి అమ్ముతూ సక్సెస్ అయింది. పురుషుల సహజ వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ డాక్టర్ స్క్వాచ్‌తో కలిసి ‘సిడ్నీస్ బాత్‌వాటర్ బ్లిస్’ అనే లిమిటెడ్ ఎడిషన్ సబ్బును విడుదల చేసింది. ఈ సోప్ నటి స్నానపు నీటి స్పర్శను కలిగి ఉండగా.. ఎక్స్‌ఫోలియేటింగ్ శాండ్, పైన్ బార్క్ ఎక్స్‌ట్రాక్ట్, పైన్, ఫిర్, ఆకుపచ్చ సుగంధాలతో కలిపి తయారు చేయబడింది. దాదాపు రూ. 500 ధరతో కేవలం 5,000 సోప్ బార్‌లు మాత్రమే ఉత్పత్తి చేయగా.. ఎగబడి కొన్నారు అభిమానులు.
తన స్నానపు నీటిని అడిగిన అభిమానులకు ఈ విధంగా గిఫ్ట్ ఇస్తున్నానని... సహజ పరిశుభ్రత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, తన ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ సబ్బును రూపొందించినట్లు సిడ్నీ వివరించింది. అయితే ఈ మార్కెటింగ్ స్టంట్ మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు మార్కెటింగ్ చాతుర్యాన్ని ప్రశంసించగా.. మరికొందరు ఓన్లీఫ్యాన్స్‌తో సమానమైన చర్యగా విమర్శించారు. ఒక ఏ-లిస్ట్ నటి ఇలాంటి స్టంట్‌లో ఎందుకు పాల్గొందని ప్రశ్నించారు.
అయితే ఇది స్నానపు నీటిని విక్రయించిన మొదటి సందర్భం కాదు. 2019లో బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్సర్ బెల్లె డెల్ఫిన్ తన స్నానపు నీటితో నిండిన ఒక్కో జార్‌ను దాదాపు రూ. 2600కు విక్రయించింది. మూడు రోజుల్లో రూ. 77 లక్షలు సంపాదించింది. డెల్ఫిన్ స్నానపు నీరు ‘సెంటిమెంటల్ పర్పసెస్’ కోసం మాత్రమేనని.. తాగడానికి కాదని డిస్క్లైమర్‌తో వచ్చింది. ఈ స్టంట్ హాస్యాస్పదంగా మాత్రమే కాదు ధైర్యంగా ప్రశంసలను అందుకుంది. కొందరు అభిమానులు ఈ జార్‌లను eBayలో వేల ధరలకు రీసేల్ చేశారు. అయితే ఆ లిస్టింగ్‌లు తొలగించబడ్డాయి.






