- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Top Tea Consuming State : ఓర్నీ.. టీ కూడా నీళ్లలా తాగేస్తున్న జనాలు.. ఎక్కడంటే..
Top Tea Consuming State : ఓర్నీ.. టీ కూడా నీళ్లలా తాగేస్తున్న జనాలు.. ఎక్కడంటే..

దిశ, ఫీచర్స్ : తలనొప్పిగా ఉందంటే చాలు.. టీ తాగు కాస్త రిలాక్స్ అవుతుందంటారు చాలా మంది. ఇద్దరు ముగ్గురు దోస్తులు కలిసినా సరదా మాటలతో పాటు తాగడానికి టీ ఉండాల్సిందే. ఇంటికి అతిథులొచ్చినా, బయటకు వెళ్లినా ఎక్కువమంది ఆసక్తి చూపే డ్రింక్ టీనే. కొందరికి రోజుకు రెండు మూడు సార్లు టీ తాగనిదే ఏమీ తోచదు. అయితే ఎవరైనా సాధారణంగా టీ తీసుకున్న ప్రతీసారి వన్ కప్ తాగుతారు. ఏ బ్రెడ్డు ముక్కనో, బిస్కెట్లో ముంచుకుని తింటే ఇంకాస్త ఎక్కువ టీ అవసరం అవుతుండవచ్చు. కానీ ఒక దగ్గర మాత్రం అలా కాదు. అక్కడి జనాలు టీని నీళ్లలా తాగేస్తుంటారని ఇండియన్ టీ బోర్డు సర్వే పేర్కొంటున్నది. ఇంతకీ అదెక్కడ అంటారా? మీరే చదవండి!
*పొద్దున్న లేశాక మనం ఒక కప్పు టీ తాగుతాం. ఇక రోజు మొత్తంలో మహా అయితే 3 కప్పులు తాగుతాం. కానీ గుజరాత్ రాష్ట్రంలోని జనాలు మాత్రం అట్ల కాదు. తాగినప్పుడల్లా ఒక కప్పు కాదు, ఒకటి లేదా రెండు ఫుల్ గ్లాసుల నిండా టీ తాగుతుంటారట ఇక్కడి గ్రామీణ ప్రజలు. అందుకే అత్యధికంగా టీ తాగే అలవాటున్న ప్రజలు గల రాష్ట్రాల్లో ఇది మొదటిస్థానంలో ఉంది. ఇక గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా గుజరాత్ ప్రజలు పొద్దున్న లేస్తే టీ, బయటకు వెళ్లొస్తే టీ, బాధ కలిగినా టీ, సంతోషం కలిగినా టీ .. ఇలా రోజు మొత్తంలో ఎక్కువగా తాగేస్తుంటారట. కారణం ఇక్కడ పాలు ఎక్కువగా లభించడమే. ప్రతీ ఇంటిలో ఆవులు, గేదెలు ఉంటాయి. కనీసం ఒక్క ఆవు అయినా తప్పక ఉంటుందని చెప్తారు.
*ఇక టీ అత్యధికంగా తాగే జనాలున్న రాష్ట్రాల్లో హర్యానా రెండవ స్థానంలో ఉండా, గోవా మూడవ స్థానంలో, పంజాబ్ 4వ స్థానంలో ఉంది. పంజాబ్‌లో లస్సీ చాలా ఫేమస్ అయినప్పటికీ ఇక్కడి ప్రజలు టీ కూడా అంతే ఇష్టపడతారు. అందుకే రోజు మొత్తంలో ఐదారుసార్లు లాగించేస్తారట. అత్యధికంగా టీ తాగే జనాలున్న మరో రాష్ట్రం జమ్మూ - కశ్మీర్ 5వ స్థానంలో ఉంది. ఇది ఎప్పుడూ మంచు, చలితో కూడిన ప్రాంతం కావడంవల్ల గరం గరం టీ తాగేందుకు అందరూ మొగ్గు చూపుతారు.






