- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Morning Tips : ప్రతి రోజూ స్నానం ఏ టైమ్‌లో చేస్తే మంచిది..? ఉదయమా.. సాయంత్రమా ?
Morning Tips : ప్రతి రోజూ స్నానం ఏ టైమ్‌లో చేస్తే మంచిది..? ఉదయమా.. సాయంత్రమా ?

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో, రోజువారి కార్యలాపాలను సమయానికి పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఒక విధంగా చెప్పాలంటే సరైన దినచర్యల(Proper routines)ను, సరైన సమాయానికి పాటించే అలవాటు మీలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే స్నానం చేసే విషయంలో ఇది ఎలా వర్తిస్తుంది? ఏ సమయంలో చేస్తే మంచిది? ఉదయమా.. సాయంత్రమా? తదితర విషయాలు తెలుసుకుందాం.
*ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఉదయంపూట స్నానం చేయడం(Taking a bath in the morning) రీఫ్రెష్ అనుభూతిని, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి దీనిని జీవనశైలిలో ఒక భాగంగా మల్చుకోవాలని చెబుతున్నారు. అయితే సరైన సమయం విషయానికి వస్తే ఉదయం 4 : 30 గంటల నుంచి 8 : 00 గంటల మధ్య స్నానం చేయడం మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. ఎందుకంటే దీనిని ‘బ్రహ్మ ముహూర్తం(Brahma Muhurta)’ అని కూడా అంటారు. ఈ టైమ్‌లో స్నానం చేయడం వల్ల ప్రకృతి సానుకూలంగా స్పందిస్తుందని(Nature responds positively), శరీరం మనసును ఉల్లాసంగా ఉంచుతుందని చెబుతారు.
*ఉదయం పూట.. అంటే ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో చల్లటి నీటితో స్నానం చేస్తే మీలోని డల్‌నెస్ పోయి మానసిక స్థితి మెరుగు పడుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా ఉదయంపూట చల్లటి నీరు శరీరానికి తాకడం వల్ల రక్త ప్రసరణ(blood circulation) మెరుగు పడుతుందని, ఒత్తిడి తగ్గుతుందని, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేదిక్ నిపుణుల(Ayurvedic experts) నమ్మకం. అయితే ఆరోగ్యం బాగాలేనప్పుడు, తీవ్రమైన చలిని తట్టుకోలేనప్పుడు వేడినీటితో (with boiling water) కూడా స్నానం చేయవచ్చు. అయితే ఇది కూడా ఉదయం బ్రహ్మముహూర్తంలో చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






