- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Time Blindness : ఆ విషయంలో టైమ్ వేస్ట్ చేస్తున్నట్లయితే.. మీకు ఈ రోగం ఉన్నట్లే..
టైమ్ బ్లైండ్‌నెస్ అంటే టైమ్ మేనేజ్ చేయడంలో ఇబ్బంది పడటం. ఈ రోగానికి సరైన నిర్ధారణ లేనప్పటికీ.. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులు సమయం వేస్ట్ చేయడం, ఒకే పనిపై అతిగా టైమ్ కేటాయించడం, గడువులోపు చేయాల్సిన పనులను పూర్తి చేయకపోవడం జరుగుతుంది.

దిశ, ఫీచర్స్ : టైమ్ బ్లైండ్‌నెస్ అంటే టైమ్ మేనేజ్ చేయడంలో ఇబ్బంది పడటం. ఈ రోగానికి సరైన నిర్ధారణ లేనప్పటికీ.. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులు సమయం వేస్ట్ చేయడం, ఒకే పనిపై అతిగా టైమ్ కేటాయించడం, గడువులోపు చేయాల్సిన పనులను పూర్తి చేయకపోవడం జరుగుతుంది. జీవితంలో దాదాపు అందరూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఈ మానసిక దృగ్విషయం.. ఒత్తిడి కలిగించే ఇతర విషయాల నుంచి దృష్టి మళ్లిస్తుంది. ఆటోమేటిక్‌గా వ్యక్తి ఎదుగుదలలో బలహీనతగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మెదడు సమయాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే విధానంలో బలహీనతగా టైమ్ బ్లైండ్‌నెస్‌కు కారణమవుతుండగా.. అటెన్షన్ డిఫిసిటీ హైపర్యాక్టివిటీ డిజార్డర్ వంటి న్యూరోడైర్షన్ సబ్ టైప్స్‌తో ముడిపడి ఉంది. దీనివల్ల ముఖ్యంగా పిల్లలు సమయం గురించి అవగాహన చేసుకోవడంలో ఇబ్బంది పడుతారు. టైమ్ బేస్డ్ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. అయితే ఇలాంటి ఇబ్బందితో బాధపడుతున్న వారు కొన్ని వ్యూహాలతో చెక్ పెట్టొచ్చు.
* అపాయింట్‌మెంట్స్, డేట్స్, గడువులను ట్రాక్ చేయడానికి అలారం, టైమర్, క్యాలెండర్‌తో సహా డిజిటల్ రిమైండర్‌లను ఉపయోగించండి. నిర్దిష్ట సమయంలో పనులు పూర్తి చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. నిర్దిష్ట పనులకు లేదా పనిలోని ఒక భాగానికి అలారాలను సెట్ చేయడం వల్ల ఒక పని నుండి మరొక పనికి ఎప్పుడు మారాలో తెలుసుకోవడంలో సహాయపడుతుంది.
* పని చేస్తున్నప్పుడు దృష్టి కేంద్రీకరించడానికి.. ఫోకస్ దెబ్బతీసే యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఉపయోగించడాన్నిఆపేయండి.
* ముఖ్యమైన గడువులను ఫోకస్‌తో కంప్లీట్ చేసేందుకు ఆఫీసులో పెద్ద క్యాలెండర్‌ను ఉంచండి. పెద్ద, చిన్న పనులుగా విభజించి.. ప్రతిదానికీ గడువును నిర్ణయించండి.
* టైమ్ మేనేజ్మెంట్ సమస్య పరిష్కారానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుల సహాయం తీసుకోండి.






