The Singularity : నాలుగేండ్లు అయితే రోబోకు, మనిషికి తేడా ఉండదు.. నమ్మలేని నిజాలు బయటపెట్టిన సైంటిస్ట్...

by Sujitha Rachapalli |
The Singularity : నాలుగేండ్లు అయితే   రోబోకు, మనిషికి తేడా ఉండదు.. నమ్మలేని నిజాలు బయటపెట్టిన సైంటిస్ట్...
X

దిశ, ఫీచర్స్ : కొందరు ఫ్యూచురిస్టులు చెప్పేది అక్షరాల నిజం అయిపోతుంది. వారి ప్రెడిక్షన్స్ నమ్మలేని వాస్తవాలుగా మారిపోతాయి. కానీ అలాంటివి చెప్పిన టైంలో మాత్రం పిచ్చోడిలా ఏదేదో చెప్తాడని కొట్టి పడేసే వారు కూడా లేకుండా పోరు. అయితే ఇలా వ్యతిరేకించేందుకు, నమ్మకం లేకపోవడానికి కారణం నకిలీ బాబాలు మార్కెట్ లో ఉండటమే కారణం. ఇక ఇదంతా పక్కన పెడితే సైంటిస్ట్ అండ్ ఫ్యూచరిస్ట్ రే కుర్జ్‌వెయిల్ ఇప్పటి వరకు చెప్పిన కొన్ని అంచనాలు ఇప్పటికే వాస్తవంగా మారగా... ఇక త్వరలో ' The Singularity (ది సింగులారిటీ)' అనే భావన కూడా నిజం కాబోతోంది. ఇంతకీ దీని అర్థం ఏమిటంటే... మనిషి, మెషిన్ విలీనం అయిపోవడం. ఇంకా వివరంగా చెప్పాలంటే హ్యూమన్ బ్రెయిన్, ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(AGI )కలిసి పని చేయడం.

మానవాళి సెకనుకు ఒక ట్రిలియన్ గణనలను చేయగల సాంకేతికతను పొందాక తర్వాత ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సాధిస్తాడని కుర్జ్‌వెయిల్ 1999లోనే చెప్పాడు. ఇది 2029లో జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఆ సమయంలో కొందరు ఈ ఆలోచనను అపహాస్యం చేశారు. ఒకవేళ జరిగితే శతాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చన్నారు. కానీ కుర్జ్‌వీల్ టైమ్‌లైన్‌కు కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పటికే AGI గురించి చర్చలు, దశాబ్దాల నాటి అంచనాలు మొదలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed