శృంగారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. ఏళ్లకు ఏళ్లు దూరంగా ఉంటే ఎలా?

by Sujitha Rachapalli |

భారతీయ సమాజంలో శృంగారం చుట్టూ మూసధోరణులు ఉన్నాయనేది తెలిసిందే. బహిరంగంగా మాట్లాడేందుకు ముందుకు రాకపోవడం.. దీని గురించి చెప్పేందుకు సంకోచించడం

శృంగారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. ఏళ్లకు ఏళ్లు దూరంగా ఉంటే ఎలా?
X

దిశ, ఫీచర్స్ : భారతీయ సమాజంలో శృంగారం చుట్టూ మూసధోరణులు ఉన్నాయనేది తెలిసిందే. బహిరంగంగా మాట్లాడేందుకు ముందుకు రాకపోవడం.. దీని గురించి చెప్పేందుకు సంకోచించడం.. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా వారిని తప్పు చేసినట్లు ట్రీట్ చేయడం.. ఇదంతా ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ సెక్స్ అనే విషయాన్ని ఒక సైన్స్‌గా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు నిపుణులు. తరుచుగా శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తున్నారు.

* లైంగిక ఆరోగ్యం మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చాలా కాలం దీనికి దూరంగా ఉంటే అనేక సమస్యలు తలెత్తుతాయి.

* నిజానికి సెక్స్.. స్ట్రెస్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు రిలీజ్ కావడంతో ఆందోళనలు తగ్గుతాయి. ఏళ్లపాటు భార్యాభర్తలు దూరంగా ఉంటే ఒత్తిడి, నిరాశ, ఆందోళనలతో సతమతమవుతారు. మానసిక అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు.

* ఈ పద్ధతి హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. బ్రెయిన్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏకాగ్రత లోపం.. అభిజ్ఞా సమస్యలు వస్తాయి.

* దంపతులు మానసికంగా దగ్గరగా ఉన్నారంటే శారీరక బంధమే కారణం. అదే లేనప్పుడు దూరం పెరుగుతుంది. తరుచుగా కలహాలు జరిగే చాన్స్ ఉంది.

* శృంగారం.. ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఫ్రీక్వెంట్ సెక్స్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుందని కూడా వివరించాయి. అలా జరగనప్పుడు రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది అనడంలో సందేహం లేదు.

* ఏళ్లపాటు శారీరకంగా కలవకపోవడం వల్ల ముందుగా ఎఫెక్ట్ అయ్యేది మహిళలే. యోని పొడిబారడం, నొప్పి, చికాకు వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి.

Next Story