సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న టీ-షర్ట్.. సెలబ్రిటీలంతా ఫిదా..

by Sujitha Rachapalli |

న్యూ టీ-షర్ట్ ట్రెండ్.. సెన్సెస్ బ్రాండ్!.. అవమానాలే సక్సెస్‌కు రూట్ మ్యాప్‌గా.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అనుజ్ షా.. సెలబ్రిటీలు ఫిదా

సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న టీ-షర్ట్.. సెలబ్రిటీలంతా ఫిదా..
X

దిశ, ఫీచర్స్ : మనవాళ్లలో చాలామంది ‘స్కిన్నీ ఫ్యాట్’ లేదా ‘సాఫ్ట్ బిల్డ్’ శరీర నిర్మాణం కలిగి ఉంటారు. పొట్ట చుట్టూ కొవ్వు.. భుజాలు వెడల్పుగా ఉంటాయి. మార్కెట్లో ఉన్న టీ షర్ట్స్ సరిపోవు. కొన్ని వదులవుతాయి. కొన్ని టైట్ అవుతాయి. ఈ సమస్యను అనుభవించిన అనుజ్ షా దీనికొక పరిష్కారం కనుగొన్నాడు.

కొత్త ట్రెండ్‌..

అనుజ్ షా వయసు 26 ఏళ్లు. అతనిది ముంబై. భారతీయ పురుషుల శరీరానికి సరిపోయే బట్టలు ఎందుకు దొరకవు? అని ఆలోచించేవాడు. ఆ ఆలోచనలోంచే ఒక బ్రాండ్ ఐడియా పుట్టింది. సాధారణ శరీర నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని 2022లో ‘సెన్సెస్’ అనే ప్రీమియం టీ-షర్టు, పోలో బ్రాండ్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు ఈ బ్రాండ్ రోజుకు 500 ఆర్డర్లు అందుకుంటోంది. రాజ్ షమాని, అదిత్య ధర్ వంటి ప్రముఖులు కూడా ఈ బ్రాండ్ ఉత్పత్తులను ఇష్టపడి ధరిస్తుండగా.. మార్కెట్లో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాడు.

సరిపోకపోయేది..

అనుజ్ కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాడు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఎంతమంచి బ్రాండ్ డ్రెస్సులైనా సూటయ్యేవి కావు. 22 ఏళ్లకే అతనికి డ్రెస్సుల రూపంలో పెద్ద సమస్య వచ్చింది. ఇక చేసేదేంలేక జిమ్‌కి వెళ్లడం స్టార్ట్ చేశాడు. బరువు తగ్గడానికి సమయం పడుతందని తెలిసినా ప్రయత్నాన్ని కొనసాగించాడు. తన శరీరానికి సరిపోయే బట్టలు ధరించాలనుకున్నాడు. మార్కెట్‌లో ఉన్న టీ-షర్టులు సరిపోకపోయేది. ప్రీమియం బ్రాండ్ల నుంచి టీ-షర్టులు కొని వాళ్లమ్మతో ఆల్ట్రేషన్ చేయించేవాడు. ఆ బట్టలు వేసుకుంటే కాలేజీలో ఫ్రెండ్స్ రకరకాల కామెంట్లు చేసేవాళ్లు.

మామతో కలిసి..

తన వ్యక్తిగత అనుభవం నుంచే అనుజ్‌కు ఒక ఐడియా వచ్చింది. తనలా ఏ బ్రాండ్ బట్టలు సరిపోని వాళ్లకు ప్రత్యేకంగా ఫిట్ అయ్యే టీ-షర్టులు తయారు చేద్దామనుకున్నాడు. వాళ్ల మేనమామ దీపక్ షా సైజ్ కూడా ఎక్స్‌ఎల్ కావడంతో అనుజ్ సమస్యను అర్థం చేసుకొని కో-ఫౌండర్‌గా చేరాడు. ఇద్దరూ కలిసి 25 లక్షలు పెట్టుబడి పెట్టి 2022 మార్చిలో సెన్సెస్ బ్రాండ్‌ను ప్రారంభించారు. సెన్సెస్ ప్రధాన బలం ఫిట్. సాధారణ భారతీయ పురుషుల శరీరాకృతిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకమైన టీ-షర్ట్, పోలోను రూపొందించారు.

సెలబ్రిటీ బ్రాండ్..

మొదట్లో నెలకు 50 ఆర్డర్లు వచ్చేవి. 2023లో పాడ్‌కాస్ట్ హోస్ట్ రాజ్ షమాని సెన్సెస్ బ్రాండ్ పోలో ధరించి పోస్ట్ చేయడంతో పెద్ద మలుపు తిరిగింది. ఒక్క రోజులో రూ.1 లక్ష వరకు అమ్మకాలు వచ్చాయి. అనుజ్ కెమెరా తీసుకొని కస్టమర్లను ఇంటర్వ్యూలు చేసి.. ఈ బట్టలు ధరిస్తే తక్షణం మంచి లుక్ వస్తుందనే భావన కల్పించాడు. ఫలితంగా 2024లో నెలకు 200 ఆర్డర్లు.. 2025 నుంచి రోజుకు 500 ఆర్డర్ల వరకు చేరుకుంది. ప్రస్తుతం నెలకు 15000 టీ-షర్టులు అమ్ముడు పోతున్నాయి. అదిత్యా ధర్, అమన్ గుప్తా, శరణ్ హెగ్డే, శంతను దేశ్‌పాండే, గౌరవ్ తనేజా వంటి ప్రముఖులు ఈ బ్రాండ్సే ధరిస్తున్నారు.

Next Story