- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత కళలకు కొత్త ప్రాణం పోస్తున్న హైదరాబాదీ
కళలు, కళాకారులు, చేతి వృత్తులకు ప్రోత్సాహం.. తెలుగు రాష్ట్రాల్లో కళా కేంద్రాల సందర్శన.. పురాతన కళలకు ఆధునిక హంగులద్దుతున్న రోహిత్.. ఇండియన్ డిజైన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు

దిశ, ఫీచర్స్ : మన దేశం.. కళలకు కాణాచి. కానీ మారిన పరిస్థితుల ప్రభావం వల్ల సాంప్రదాయ కళలు ఉనికి కోల్పోతున్నాయి. ఈ పరిస్థితిని చూసి చలించిన హైదరాబాద్‌కు చెందిన రోహిత్ నాగ్ ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. దీనికోసం ‘నోల్వా’ అనే స్టూడియోను స్థాపించాడు.
హైదరాబాద్‌లో క్యాంపస్..
‘నోల్వా’ అంటే న్యూ ఓల్డ్ ఆల్వేస్ అన్నట్టు. ‘నోల్వా’ ద్వారా భారతీయ సాంప్రదాయక కళలను, కళాకారులను, చేతి వృత్తులను బతికిస్తున్నాడు. బిద్రి, ఎటికొపాకా వంటి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కళలను ఆధునిక దృక్పథంతో పునరుద్ధరిస్తున్నాడు. శిల్పాల్లాంటి ఫర్నీచర్, లైటింగ్, ఇంజనీరింగ్ వంటి వాటి మధ్య సమన్వయం కల్పిస్తోంది. దీనికోసం హైదరాబాద్ శివారులో రెండు ఎకరాల క్యాంపస్ తీసుకున్నాడు. ఈ విస్తీర్ణంలో 6000 చదరపు అడుగుల స్టూడియో నిర్మించాడు. మాస్టర్ కళాకారులతో కలిసి ఆర్ట్ డిజైనింగ్‌లో కొత్త ఒరవడి సృష్టిస్తు్న్నాడు.
పురాతన కళలవైపు..
రోహిత్ దృష్టిలో డిజైనింగ్ అందం కోసమే కాదు. భారతీయ చేతి వృత్తుల పట్ల ప్రజలు మళ్లీ ఆకర్షుతలయ్యేలా చేయడం తన లక్ష్యం. సాంప్రదాయిక నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్ ఆలోచనతో మేళవించి.. వేగంగా మారుతున్న ప్రపంచంలో వారసత్వానికి సరికొత్త నిర్వచనం చెప్తున్నాడు. అతడి కృషికి గుర్తింపుగా ట్రెండ్స్ అవార్డు.. ఎల్లె డెకర్ ఇండియా వంటి అవార్డులు కూడా వచ్చాయి. రోహిత్ హైదరాబాద్‌లో పుట్టినప్పటికీ ఆంధ్ర, రాయలసీమ మిశ్రమ సంస్కృతుల వాతావరణంలో పెరిగాడు. అమెరికాలో డ్యూక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ ఆలోచన పురాతన కళలవైపు వెళ్లింది.
2800 చేతి వృత్తులు..
ఇండియాలో దాదాపు 2800 రకాల చేతి వృత్తులు ఉన్నాయి. కానీ వాటికి డిమాండ్ లేక చాలా వరకు మరుగున పడ్డాయి. దీనిని గమనించిన రోహిత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కళా కేంద్రాలను సందర్శించి అధ్యయనం చేశాడు. కలంకారి, స్టోన్‌క్రాఫ్ట్, ఫిలిగ్రీ వంటి వాటి గురించి తెలుసుకున్నాడు. అలా బిద్రి, ఎటికొపాకా కళలు అతడి దృష్టిని ఆకర్షించాయి. బిద్రి.. నల్లటి లోహం మీద వెండి ఇన్‌లే చేసే అపూర్వ కళ. సాంప్రదాయికంగా వాజెస్.. బాక్సులు తయారు చేస్తారు. ఆధునికతను దృష్టిలో ఉంచుకొని బిద్రి, ఎటికొపాకా కళలను అందమైన రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
మూడు సూత్రాలు..
‘నోల్వా’ ద్వారా రోహిత్ ఏం చేస్తాడంటే సాంప్రదాయక కళలకు ఆధునిక డిజైన్‌ను మేళవిస్తాడు. ఇక్కడ డిజైనర్లు, ఇంజనీర్లు, కళాకారుల బృందాలు ఉంటాయి. వీళ్లందర్నీ రోహిత్ సమన్వయం చేస్తాడు. ప్రతి ‘నోల్వా’ ప్రోడక్ట్ మూడు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. యంత్రాలు చేయలేని పనులు చేస్తారు. ప్రతీది కళా కేంద్రంగా ఉంటుంది. చూసిన వాళ్లకు రెండోసారి చూడాలనిపించేలా ఆకర్షణతో ఉంటాయి. హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ చిన్న ప్రయత్నం ఇప్పుడు భారతీయ డిజైన్ ప్రపంచంలో గుర్తింపు పొందుతోంది. పురాతన కళలను ఆధునిక హంగుల్లో చూసే భాగ్యం కల్పిస్తున్నారు.






