గోల్డ్ ఏటీఎం వచ్చేసిందోచ్.. నిమిషాల్లోనే చేతిలో డబ్బులు

by Sujitha Rachapalli |

గోల్డ్ ఏటీఎం వచ్చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా చైనా ఈ ఏటీఎంను తీసుకొచ్చింది. షాంఘైలోని గ్లోబల్ హార్బర్ మాల్‌లో ఉన్న ఈ మొదటి బంగారు ATMని షెన్‌జెన్‌కు చెందిన కింగ్‌హుడ్ గ్రూప్ డెవలప్ చేసింది. వినియోగదారులు తమ బంగారు ఆభరణాలు

గోల్డ్ ఏటీఎం వచ్చేసిందోచ్.. నిమిషాల్లోనే చేతిలో డబ్బులు
X

దిశ, ఫీచర్స్ : గోల్డ్ ఏటీఎం వచ్చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా చైనా ఈ ఏటీఎంను తీసుకొచ్చింది. షాంఘైలోని గ్లోబల్ హార్బర్ మాల్‌లో ఉన్న ఈ మొదటి బంగారు ATMని షెన్‌జెన్‌కు చెందిన కింగ్‌హుడ్ గ్రూప్ డెవలప్ చేసింది. వినియోగదారులు తమ బంగారు ఆభరణాలు, బంగారు వస్తువులను అమ్మేందుకు అనుమతిస్తుంది. గోల్డ్‌ను 1200°C ఉష్ణోగ్రత వద్ద కరిగించి దాని స్వచ్ఛతను పరీక్షిస్తుంది. షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ రియల్-టైమ్ ధరల ఆధారంగా దాని విలువను లెక్కించి.. సంబంధిత మొత్తాన్ని వినియోగదారు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది. ఈ ప్రాసెస్‌కు సుమారు 20 నిమిషాలు పడుతుంది. కాగా ఈ ATMలు ప్రస్తుతం చైనాలో సుమారు 100 నగరాల్లో ఉండటం విశేషం.

ఇక ఆర్థిక అనిశ్చితులు, బంగారం పట్ల సాంస్కృతిక ఆకర్షణ కారణంగా గరిష్ట స్థాయిలో ఉన్న బంగారం ధరల మధ్య పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తున్నాయి. చైనాలో బంగారం కొనుగోలు చేసేవారిలో సగం కంటే ఎక్కువ మంది 1990 తర్వాత పుట్టినవారే ఉన్నారని తెలుస్తోంది. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బంగారం లావాదేవీల ద్వారా త్వరిత ఆర్థిక లాభాలను పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇండియాలో ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు తులం బంగారం ధర లక్షకు చేరువలో ఉండగా.. నిపుణులు బంగారంపై పెట్టుబడులు ఆర్థికంగా ఎదిగేలా చేస్తుందని సూచిస్తున్నారు.

Next Story