- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫెస్టివల్ డేటింగ్.. పండుగ సమయంలో శృంగార భాగస్వామి కోసం వేట
రంగు రంగుల కాంతులు, నోరూరించే వంటకాలు, కొత్త బట్టలు.. ఫెస్టివల్ సీజన్ ను మరింత స్పెషల్ గా మారుస్తాయి.

దిశ, ఫీచర్స్ : రంగు రంగుల కాంతులు, నోరూరించే వంటకాలు, కొత్త బట్టలు.. ఫెస్టివల్ సీజన్ ను మరింత స్పెషల్ గా మారుస్తాయి. మ్యాజికల్ మూమెంట్స్ ను అందిస్తాయి. అయితే ఈ సమయాన్ని మరింత రొమాంటిక్ గా మార్చుకోవాలని కోరుకుంటున్నారు Gen Z, మిలీనియల్స్. 63శాతం మంది ఈ హ్యాపీ టైంలో శృంగార భాగస్వామిని కనుగొనాలని ఆరాటపడుతున్నారు. ఇండియాలో ఈ కల్చర్ పెరిగిపోతుండగా.. ఫెస్టివల్ డేటింగ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
డేటింగ్ యాప్ బంబుల్ సర్వేలో ముఖ్యంగా మిలీనియల్స్ ఈ డేటింగ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారని తేలింది. జంటగా ఉన్న కొందరు కలిసి పండుగలు జరుపుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వీరిపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. జంటగా షాపింగ్ చేయడం, పండుగ బహుమతులు ఇవ్వడం, పార్టీలకు హాజరవడం, కలిసి పూజ చేయడం వంటి వాటిని ఇష్టపడుతున్న యూత్.. రొమాంటిక్ కనెక్షన్ కోసం తహతహలాడుతున్నారు. ఒంటరిగా పండుగలను జరుపుకునే బదులు డేటింగ్ కు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ డేటింగ్ స్పీడ్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారుతుంది. కాగా ఈ భాగస్వామ్య సంప్రదాయాలు స్ట్రాంగ్ అండ్ డీప్ రిలేషన్స్ ఏర్పడటానికి మార్గాలుగా పని చేస్తున్నాయి.
టిప్స్ ఫర్ డేటింగ్
* హాలిడేస్ లో ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఒంటరితనం వేధిస్తుంది. ఇతరులు కూడా అదే విధంగా భావిస్తున్నారా లేదా గుర్తించడం చాలా ముఖ్యం. ఎప్పుడు, ఎలా, ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం ఇంపార్టెంట్.
* ఫ్రెండ్స్ తమ పార్టనర్స్ తో హ్యాపీగా పండుగ జరుపుకోవడం చూసి.. మిమ్మల్ని వారితో పోల్చుకోవడం మానుకోండి. జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు నచ్చిన వారితో డేటింగ్ చేయండి.
* పండుగ సీజన్‌లో సెల్ఫ్ లవ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. మీరు భాగస్వామితో ఉన్నా లేకపోయినా పండుగలను ఆస్వాదించవచ్చు. ఫెస్టివల్ సీజన్‌ను పూర్తి స్థాయిలో సెలబ్రేట్ చేసుకోవచ్చు.
* పండుగ ఉత్సాహం మధ్య డేటింగ్ హ్యాపీగా ఉండాలని గుర్తుంచుకోండి. మీరు ఎవరితోనైనా డేటింగ్ ప్రారంభించినప్పుడు వెంటనే పార్టనర్ ను మీ సోషల్ సర్కిల్‌కు పరిచయం చేయడం ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. కానీ దానికి ముందు మీ కంఫర్ట్ లెవల్ అంచనా వేయడానికి సమయాన్ని వెచ్చించండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీటింగ్ కు తీసుకువెళ్లే ముందు రొమాంటిక్ డేటింగ్ ద్వారా ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం చేయండి.






