ఏలియన్ బ్యాక్టీరియా.. అంతరిక్షం నుంచి భూమికి తీసుకొచ్చిన చైనా.. పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలుసా?

by Sujitha Rachapalli |

చైనా శాస్త్రవేత్తలు అంతరిక్ష కేంద్రంలో కొత్త బ్యాక్టీరియాను గుర్తించారు. షెన్‌జౌ-15 మిషన్ సమయంలో తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో నియాలియా తియాంగాంగెన్సిస్‌ను కనుగొన్నారు. ఈ సూక్ష్మజీవి భూమిపై గతంలో గుర్తించబడలేదు.

ఏలియన్ బ్యాక్టీరియా.. అంతరిక్షం నుంచి భూమికి తీసుకొచ్చిన చైనా.. పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చైనా శాస్త్రవేత్తలు అంతరిక్ష కేంద్రంలో కొత్త బ్యాక్టీరియాను గుర్తించారు. షెన్‌జౌ-15 మిషన్ సమయంలో తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో నియాలియా తియాంగాంగెన్సిస్‌ను కనుగొన్నారు. ఈ సూక్ష్మజీవి భూమిపై గతంలో గుర్తించబడలేదు. కానీ భూమిపై ఉన్న నియాలియా సర్కులన్స్‌కు సంబంధించిన ఒక వేరియంట్‌గా మాత్రం చెప్పబడుతుంది. అంతరిక్ష పరిస్థితులకు అనుగుణంగా మారిందని చెప్పబడుతుంది. దీన్ని స్వాబ్‌ల ద్వారా సేకరించిన సైంటిస్టులు.. ఫ్రీజ్ చేసి చైనా స్పేస్ స్టేషన్ హాబిటేషన్ ఏరియా మైక్రోబయోమ్ ప్రోగ్రామ్ (CHAMP) లో భాగంగా భూమికి తీసుకువచ్చారు. దీంతో ఇది ఏలియన్ బ్యాక్టీరియాగా ప్రచారం పొందింది.

కాగా ఈ బ్యాక్టీరియా జెలటిన్‌ను జీర్ణం చేసి రక్షణాత్మక బయోఫిల్మ్‌లను ఏర్పరచడం, రేడియేషన్‌ను తట్టుకోవడం, DNA నష్టాన్ని రిపేర్ చేయడం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. సూక్ష్మ గురుత్వాకర్షణ, అధిక రేడియేషన్ వాతావరణంలో జీవించడానికి సహాయపడే ఈ బ్యాక్టీరియా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో సెప్సిస్‌కు కారణమవుతుంది. అంటే మానవ శరీరంలో రక్తం విషపూరితం కావడం ద్వారా కలిగే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. కానీ నియాలియా తియాంగాంగెన్సిస్ వ్యోమగాములకు ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుందా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ పరిశోధన తీవ్రమైన వాతావరణాలలో సూక్ష్మజీవుల అనుకూలత, అంతరిక్ష మిషన్లలో కఠినమైన సూక్ష్మజీవ నియంత్రణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. కానీ ఏలియన్ బ్యాక్టీరియా అనే వాదన అవాస్తవమని.. ఇది భూమిపై ఉన్నదే కానీ అంతరిక్షానికి అనుగుణంగా మారిందని చెప్తున్నారు నిపుణులు.

Next Story