- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడుపు ఉబ్బరంగా ఉంటుందా..? అన్నం తినేటప్పుడు ఇలా చేయండి..
కడుపు ఉబ్బరం అనేది చాలా మందికి ఉండే సమస్య. ఇదెలా వస్తుందంటే.. సాధారణంగా చిన్న ప్రేగులో 200మిలీ వరకు గ్యాస్ ఉంటుంది. మనం తినేటప్పుడు నైట్రోజన్, ఆక్సిజన్ ప్రేగుల్లోకి ప్రవేశిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్, మీథేన్

దిశ, ఫీచర్స్ : కడుపు ఉబ్బరం అనేది చాలా మందికి ఉండే సమస్య. ఇదెలా వస్తుందంటే.. సాధారణంగా చిన్న ప్రేగులో 200మిలీ వరకు గ్యాస్ ఉంటుంది. మనం తినేటప్పుడు నైట్రోజన్, ఆక్సిజన్ ప్రేగుల్లోకి ప్రవేశిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్, మీథేన్ ప్రేగుల్లోనే బ్యాక్టీరియా ద్వారా సృష్టించబడుతుంది. అప్పుడు చిన్న ప్రేగులో గ్యాస్ ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ అయినప్పుడు కడుపు ఉబ్బరంగా ఉండటం, పదే పదే తేన్పులు రావడం జరుగుతుంది. ఒకేసారి ఎక్కువ ఆహారం నోట్లో పెట్టుకోవడం, ధూమపానం, ఎక్కువ లాక్టోజ్ ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా గ్యాస్ ఎక్కువగా చేరుకుంటుంది. దీని నుంచి బయటపడేందుకు చిన్న చిన్న ముద్దలు తినండి. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం తగ్గించండి. కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. వ్యాయామం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది.
* ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆహారం చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని బాగా నమిలి తినాలని చెప్తున్నారు నిపుణులు.
* అలాగే పాలు, పాల పదార్థాలు తగ్గించుట ద్వారా అధిగమించవచ్చు.
* బీన్స్, బ్రోకలీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటి పదార్థాలకు దూరంగా ఉండండి.
* యాంటీబయాటిక్స్, పెయిన్ రిలీవర్స్, లాక్సిటివ్స్ వంటి కొన్ని మందులు అవాయిడ్ చేయండి.
* రుతుచక్రం, గర్భం సమయంలో ఏర్పడే హార్మోన్ల అసమతుల్యత జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి ఉబ్బరానికి దారితీస్తుంది. కాబట్టి డాక్టర్ల సూచన మేరకు ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ తీసుకోవాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.






