- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడింగ్ ప్రాంజలి.. ఏఐ స్టార్టప్‌తో అంచెలంచెలుగా ఎదిగి..!
స్కూల్ వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ప్రాంజలి ఏఐ, మెషీన్ లెర్నింగ్ రంగాలను అన్వేషించింది.

దిశ, ఫీచర్స్ : ఏడేళ్ల వయసులో కోడింగ్ నేర్చుకుని.. 16 ఏళ్ల వయసులో ఏఐ స్టార్టప్ ప్రారంభించి, ఇప్పుడు రూ.100 కోట్ల వాల్యుయేషన్‌తో సంచలనం సృష్టిస్తోంది ప్రాంజలి అవస్థి. చిన్న వయసులోనే టెక్నాలజీ.. ప్రోగ్రామింగ్ వైపు ఆసక్తి పెంచుకొని అంచెలంచెలుగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
16 ఏళ్ల వయసులో..
స్కూల్ వయసులోనే కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ప్రాంజలి క్రమంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మెషీన్ లెర్నింగ్ రంగాలను అన్వేషించింది. విద్యార్థిగా ఉండగానే ప్రాక్టికల్ అనుభవం సంపాదించింది. 13 ఏళ్ల వయసులో ఒక రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ పొంది మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్టులపై పని చేసింది. ఆ సమయంలో రీసెర్చర్లు ఎదుర్కొంటున్న సమస్యలు.. డేటా సేకరణ తనను ఆకర్షించాయి. ఈ అనుభవంతో 16 ఏళ్ల వయసులో Delv.AI ఏఐ ఆధారిత ప్లాట్‌ఫాం ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫాం రీసెర్చర్లకు ఆన్‌లైన్ సోర్సుల నుంచి సమాచారం సేకరించడం.. విశ్లేషించడం సులభం చేస్తుంది.
రూ.100 కోట్ల వాల్యుయేషన్
మయామిలోని ఒక స్టార్టప్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్‌లో ఎంపికైన Delv.AI ద్వారా అనుభవజ్ఞులైన మెంటర్లు.. ఇన్వెస్టర్లతో అనుసంధానం ఏర్పడింది. ఆ తర్వాత ఆన్ డెక్.. విలేజ్ గ్లోబల్ వంటి ఇన్వెస్టర్ల నుంచి రూ.3.7 కోట్లు ఫండింగ్ సాధించింది. ప్రస్తుతం ఈ స్టార్టప్ రూ.100 కోట్ల వాల్యుయేషన్‌ను చేరుకుంది. ప్రాంజలి ప్రపంచంలోనే అతి చిన్న వయసులో విజయవంతమైన ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఈ విజయం కేవలం టాలెంట్ వల్ల మాత్రమే రాలేదు. అంశాల పట్ల ఆసక్తి.. కష్టపడటం.. లక్ష్య సాధనలో నిర్ణయం తన ఫలితానికి కారణంగా చెప్తోంది.






