- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యమునా నది కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎర్త్ వారియర్స్
అతడి ధ్యాసంతా నదుల కాలుష్యాన్ని తగ్గించడంపైనే.

దిశ, ఫీచర్స్: పంకజ్‌ది ఢిల్లీ. అందరిలా అతడిదీ బిజీ లైఫ్. ఎంత అంటే ఇంట్లో చెత్తను కనీసం చెత్తకుండీలో కూడా వేయలేనంత అన్నమాట. ఈ రొటీన్ బిజీ లైఫ్ నుంచి రియలైజ్ అయ్యాడు. అసలిది జీవితమేనా అని ఆలోచించుకున్నాడు. అతడి ధ్యాసంతా నదుల కాలుష్యాన్ని తగ్గించడంపైనే.
క్లీన్ యమునా
పంకజ్ గతంలో కార్పొరేట్ ఉద్యోగం చేసేవాడు. నదుల గొప్పదనం గురించి చాలా గొప్పగా తెలుసుకున్న పంకజ్‌కు వాటి కాలుష్య వార్తలు చూసి మనసు కకావికలం అయ్యింది. దేశంలో ఉన్న నదులన్నింటినీ శుభ్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎర్త్ వారియర్స్ అనే స్వచ్చంద సంస్థను స్థాపించాడు. నదుల కాలుష్యానికి కారణమైన వ్యవస్థలను పరిశీలించి.. సమస్యలను పరిష్కరించేందుకు ఎర్త్ వారియర్స్ కృషి చేస్తోంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా శుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాన్ని మేల్కొలుపుతున్నాడు.
పునరుజ్జీవం కోసం
ప్రతీ ఆదివారం ఉదయం.. ఢిల్లీలోని కూలింద్ కుంజ్ ఘాట్ దగ్గర యమునా నదీతీరంలో పంకజ్.. అతడి బృందం గ్లోవ్స్ ధరించి.. నిశ్చలమైన సంకల్పంతో పని చేస్తూ కనిపిస్తుంటారు. వారు చేసే పని సామాన్యమైంది కాదు. ఇండియాలో అత్యంత కలుషితమైన నదుల్లో ఒకటైన యమునా నదీలోని చెత్త.. ప్లాస్టిక్.. శిథిలాలను తొలగించే పని అది. పంకజ్‌లా చేస్తారా ఎవరైనా.? ఇది కేవలం చెత్తను శుభ్రం చేసే పని మాత్రమే కాదు. నిర్జీవమైపోతున్న ఒక గొప్ప నేపథ్యమున్న నదిని పునరుజ్జీవింప చేస్తున్నాడు.
నివారణే ఉత్తమ చికిత్స
ఇండియాలో రోజూ దాదాపు 7300 కోట్ల లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుందని ఒక అంచనా. కానీ దీనిలో కేవలం 28శాతం మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలిన మురుగునీరు శుద్ధి చేయకుండానే యమునా వంటి నదుల్లోకి వెళ్తుంది. ఈ కాలుష్యం మన నగరాలను.. నీటి వనరులను నాశనం చేస్తుంది అని గ్రహించాడు పంకజ్ కుమార్. ఈ సమస్యకు శుభ్రత ఒక్కటే పరిష్కారం చూపించలేదనుకున్న పంకజ్.. ఎర్త్ ఇండియా వారియర్స్ ద్వారా తమ లక్ష్యాన్ని విస్తరింపజేశాడు. 12 రాష్ట్రాల్లోని మురుగునీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించి నివారణే ఉత్తమ చికిత్స అని అవగాహన కల్పిస్తున్నారు.
ఉద్యమానికి శ్రీకారం
యమునా నదిలో కేవలం 2శాతం భూభాగంలోనే 80శాతం కాలుష్యం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తెలిపింది. నజఫ్‌గడ్.. షహదారా వంటి భారీగా కలుషితమైన కాలువలు దీనికి ప్రధాన కారణం. గురుగ్రామ్ వంటి నగరాల్లో రంగువేసే.. రసాయన యూనిట్ల నుంచి వచ్చే వ్యర్థాలు నియంత్రణ లేకుండా నీటి వనరుల్లోకి చేరుతున్నాయి. అదీగాక ఇప్పటికే ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు కూడా ప్రాథమిక భద్రతా ప్రమాణాలను అనుసరించడంలో విఫలం అవుతున్నాయని పంకజ్ కుమార్ తెలుసుకొని ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఒక సైన్యాన్నే తయారుచేశాడు.






