భారతీయ సంస్కృతిని నేర్పించే చిత్తం స్టార్టప్

by Daayi Srishailam |

పిల్లలకు.. కల్చర్‌‌కు వారధిగా నిలుస్తోంది చిత్తం

భారతీయ సంస్కృతిని నేర్పించే చిత్తం స్టార్టప్
X

చదువంటే ర్యాంకులు.. మార్కులేనా.?

ఆటలు.. చదువులో భాగం కాదా.?

చదువును.. ఆటల్ని ఒకటిగా చూడాలా.. వేర్వేరుగా చూడాలా.?

అసలు పిల్లలకు చదువెలా చెప్పాలి.?

"చిత్తం" ఇదే ప్రశ్నిస్తోంది.

చిత్తం అంటే మన చిత్తం కాదు.

అదొక స్టార్టప్.

పిల్లలకు.. కల్చర్‌‌కు వారధిగా నిలుస్తోంది చిత్తం.

దిశ, ఫీచర్స్: చిన్నారులకు భారతీయ సంస్కృతిని ఆటల ద్వారా దగ్గర చేయాలనే ఆలోచనతో రూపొందించిందే "చిత్తం స్టార్టప్". దీని ఫౌండర్ చరణ్య కుమార్. ఆమె రూపొందించిన పర్యావరణ హితమై.. కథల ఆధారిత ఆటల కిట్లు.. కుటుంబాలను ఒక్కో కథ.. ఒక్కో కార్డు ద్వారా ఏకం చేస్తున్నాయి.

బంధం బలోపేతం

ప్రతి ఇంట్లో ఇదే చూస్తున్నాం. స్కూల్స్ ఎలాగూ లేవు కాబట్టీ.. పిల్లలకు ఫోన్లకు అత్తుకుపోతున్నారు. పిల్లల చేతిలో ఫోన్ లాక్కోవడం.. కసురుకోవడం.. బుద్ధిలేదా అని అరవడం ఇవే చేస్తుంటారు పేరెంట్స్. అయితే ఈ సమస్యలేవీ ఉండొద్దంటే పిల్లలతో ఆనందరకమైన.. అర్థవంతమైన క్షణాలను గడపాలని కోరుకుంటోంది చరణ్య కుమార్. అలాంటి వారి కోసమే "చిత్తం" స్టార్టప్ తీసుకొచ్చినట్లు చెప్తున్నారామె. ఆటల ద్వారా పిల్లలకు భారతీయ చరిత్ర.. సంస్కృతి.. పురాణాలను పరిచయం చేస్తూ పిల్లలతో తల్లిదండ్రుల బంధాన్ని బలోపేతం చేస్తోంది.

కథల ఆధారంగా..

స్కూల్స్ పిల్లలకు ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవడం.. సవాళ్లను ఎదుర్కునే విధానాలను నేర్పించవు అని గ్రహించిన చరణ్య.. ఆ లోటును భర్తీ చేయాలనే ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే "చిత్తం". దీనర్థం మనసు లేదా ఆత్మ. పిల్లల్లో స్వీయ అవగాహన.. సాంస్కృతిక గుర్తింపు పట్ల ఆసక్తిని పెంపొందించడమే చిత్తం లక్ష్యం. స్వతంత్రంగా ఆలోచించే.. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని 2023 జనవరిలో దీనిని స్థాపించింది. రెండున్నరేళ్లలో 17 ఆటలను సేకరించి.. బోర్డు గేమ్స్ నుంచి కథల ఆధారిత కిట్స్.. కార్యకలాపాలను సిద్ధం చేశారు. ఇవన్నీ భారతీయ విలువల్ని చేరువ చేసేవే.

ఆటలుగా మార్చడమెలా.?

చరణ్య ఒక ఆట గురించి వివరించమని అడిగితే.. "భారత్ విలాస్" కార్డ్ గేమ్ ఎంచుకుంటారు. ఈ ఆట రమ్మీ ఆధారంగా రూపొందింది. రమ్మీలో నాలుగు సూట్లుంటాయి. అదే విధంగా భరత్ విలాస్లో నాలుగు రకాల కార్డులున్నాయి. స్మారక చిహ్నం.. నేత వస్త్రం.. నృత్య రూపం.. ఆహారం. ఒకే రాష్ట్రానికి చెందిన నాలుగు కార్డులను సేకరిస్తే ఆట గెలుస్తారు. మరో ఆట "మై ఆధార్". దీనిలో 21 ప్రశ్నలుంటాయి. పిల్లలకు వారి స్వస్థలం.. సంస్కృతి గురించి ఆకస్తిని రేకెత్తిస్తుంది. ఈ ఆట రాష్ట్రాల మధ్య సామ్యాలను.. వైవిధ్యాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చేస్తుంది.

కుటుంబ కిట్ సుప్రభాతం

"సుప్రభాతం" అనే కార్యకలాప ఆధారిత కుటుంబ కిట్ కూడా దీంట్లో చాలా ప్రత్యేకమైంది. ఈ రోజుల్లో ఎంతమంది కుటుంబ సభ్యలతో కలిసి మాట్లాడుతున్నారు చెప్పండి.? ఈ ఆట కుటుంబ సభ్యులను ఒకచోట చేర్చి.. కథలు.. చిన్న కార్యకలాపాల ద్వారా సానుకూల సంభాషణలను ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు ఒకరితో ఒకరు జాలిగా మాట్లాడటం.. కలిసి ఒకే పనిని చేయడం.. ఒకరోజు దృక్పథాన్ని మార్చుకోవడం వంటివి. ఇంకా చిత్తం ఆటలన్నీ పర్యావరణహితంగానే ఉంటాయి. కాగితం.. కార్డ్ బోర్డ్.. చెక్కను ఉపయోగిస్తారు.

రేపటి తరానికి..

రెండున్నరేళ్లలో "చిత్తం" స్వీట్ కారం కాఫీ" వంటి బ్రాండ్స్‌తో సహకరించి వారి సాంస్కృతిక కథలను ఆటలుగా మార్చింది. బ్రిటానియా మేరీ గోల్డ్ హర్ స్టార్టప్ షోలో రూ.10 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది. అయినప్పటికీ చరణ్య లక్ష్యం విజయం కంటే గొప్పది. ఆమె నాటే సంస్కృతి బీజాలు రేపటి తరానికి బలాన్నిస్తాయి. ఇప్పుడు సాంస్కృతిక రోబోటిక్స్.. టెక్నాలజీ ఇంటిగ్రేషన్.. బీటుబీ సహకారాలపై దృష్టి సారిస్తోంది. పిల్లలు తమ సంస్కృతిని కథలు.. ఆటలు రూపంలో నేర్చుకొని కుటుంబ బంధాలను తిరిగి కనుగొంటాయి అంటున్నది చరణ్య.

Next Story