Viral video : వామ్మో.. స్కూల్‌కు వెళ్లేముందు అమ్మాయిలు చేసిన పనికి అందరూ షాక్!

by Javid Pasha |   (  Updated:2025-01-29 07:02:50  IST  )

Viral video : వామ్మో.. స్కూల్‌కు వెళ్లేముందు అమ్మాయిలు చేసిన పనికి అందరూ షాక్ !

Viral video : వామ్మో.. స్కూల్‌కు వెళ్లేముందు అమ్మాయిలు చేసిన పనికి అందరూ షాక్!
X

దిశ, ఫీచర్స్ : చదువుకునే పిల్లలంతా బడికి వెళ్లాలంటే ఏం చేస్తారు? పొద్దున్న రెడీ అయి స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తుంటారు. బస్సు రాగానే అందులో కూర్చొని వెళ్లిపోతారు. మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు. ఇక బడి ఇంటికి దగ్గరే ఉన్నవాళ్లయితే నడుచుకుంటూ వెళ్తారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఏ మారుమూల ప్రాంతాల్లోనో, రవాణా సౌకర్యంలేని గ్రామాల్లోనో అయితే.. కొన్నిసార్లు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. చదువుకోవాలన్న విద్యార్థుల సంకల్పానికి పరీక్ష పెడుతుంటాయి. ఇబ్బందులను ఎదుర్కొనేలా చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో విద్యార్థినులు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందనే కదా మీ సందేహం?

వైరల్ వీడియో ప్రకారం.. బడికి వెళ్లేందుకు బయలు దేరిన విద్యార్థినులు ఒకచోటికి రాగానే ఆగిపోయారు. ఎందుకంటే.. అక్కడో పెద్ద నదీలోయ ఉంది. చూస్తేనే భయంకరంగా అనిపిస్తోంది. అది దాటాలంటే పెద్ద సాహసమే కావాలి. ఆ విద్యార్థినులు సైతం అదే ప్రయత్నం చేస్తున్నారు. లోయను దాటేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాడుతో కూడిన రోప్ ట్రాలీని లాగుతున్నారు. ఇలా ఏ ఒక్కరోజో కాదు, ప్రతీ రోజు అక్కడి విద్యార్థులంతా ఇలాగే చేస్తున్నారని వీడియోలోని కంటెంట్‌ను, విద్యార్థినుల సంభాషణను బట్టి తెలుస్తోంది.

కాగా ‘త్రిభువన్ చౌహాన్’ అనే ఇన్‌స్టా హ్యాండిల్‌లో పోస్ట్ అయిన ఈ వైరల్ వీడియో ప్రకారం.. నదీలోయను దాటే ప్రయత్నం చేసిన విద్యార్థినులు ఉత్తరాఖండ్‌లోని మున్సియారి గ్రామంలోని పాఠశాలకు చెందినవారు. ప్రతి రోజూ ఇలా రోప్ తాడు సాయంతో నదిని దాటుతూ చదువుకోవడానికి వెళ్తున్నారు. అయితే రోప్ ట్రాలీని లాగుతున్న విద్యార్థినులను ఓ వ్యక్తి పలకరిస్తూ.. ‘2025లో కూడా మన వ్యవస్థ చూడండి ఎలా ఉందో. బాలికల పరిస్థితి ఏం మారడం లేదు’ అంటూ మాట్లాడటం వీడియోలో గమనించవచ్చు. ఈ క్రమంలో ఆ విద్యార్థినుల్లో ఒకరు తాను 9వ తరగతి చదువుతున్నట్లు, మరో విద్యార్థిని 5 తరగతి చదువుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తాము ప్రతిరోజూ బడికి వెళ్లాలంటే ఇలా రోప్ ట్రాలీపై నదిని దాటుకుంటూ వెళ్లాల్సిందేనని, ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చారు. కాగా ఈ వీడియో కొద్దిగంటల్లోనూ 18.4 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంకెందుకాలస్యం.. మీరూ చూసేయండి.

Video credits to tribhuwan chouhan Ista id

Next Story