AI robotics : వావ్.. అచ్చం మనుషుల్లా కాఫీ తయారు చేస్తున్న రోబో!!

by Javid Pasha |

AI robotics : వావ్.. అచ్చం మనుషుల్లా కాఫీ తయారు చేస్తున్న రోబో!!

AI robotics : వావ్.. అచ్చం మనుషుల్లా కాఫీ తయారు చేస్తున్న రోబో!!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని అద్భుతాలు చేస్తున్నదో తెలిసిందే. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I) అందుబాటులోకి ఆయా రంగాల్లో మార్పులు వస్తున్నాయి. పనులు మరింత సులభతరం అవుతున్నాయి. మెరుగైన సౌకర్యాలు చేకూరుతున్నాయి. ఇక ఇంటి పని మొదలు కొని వంట చేసే రోబోట్స్ వరకు తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

వైరల్ సమాచారం ప్రకారం.. ఓ రోబోటిక్స్(AI Robotics) కంపెనీ తాము తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబో(Humanoid robot) చేసే పనులకు సంబంధించిన వీడియోను ప్రదర్శించింది. ‘artificialzone’ అనే ఇన్‌స్టా హ్యాండిల్‌లో దీనిని షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ రోబో చేసిన పని అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇంతకీ ఏం చేసిందంటే.. ఆ హ్యూమనాయిడ్ రోబోట్ అచ్చం మనిషిలా కాఫీ తయారు చేసింది(Made coffee like a man). కాగా అది 10 గటలపాటు మనుషులు కాఫీ తయారు చేయడాన్ని చూసి నేర్చుకున్నదట. ఈ డెవలప్‌మెంట్ భవిష్యత్‌లో ఏఐ టెక్నాలజీ (AI technology) అండ్ రోబోటిక్ అవసరాలపై ఆసక్తి రేపుతోందని నిపుణులు అంటున్నారు.

Next Story