Talk to Write.. మాటల్ని రాతలుగా మార్చే ఏఐ సిస్టమ్‌ను క్రియేట్ చేసిన స్టూడెంట్స్.. వీడియో వైరల్

by Javid Pasha |   (  Updated:2025-08-04 07:23:20  IST  )

Talk to Write.. మాటల్ని రాతలుగా మార్చే ఏఐ సిస్టమ్‌ను క్రియేట్ చేసిన స్టూడెంట్స్.. వీడియో వైరల్

Talk to Write.. మాటల్ని రాతలుగా మార్చే ఏఐ సిస్టమ్‌ను క్రియేట్ చేసిన స్టూడెంట్స్.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీని వినియోగించుకోవడమే కాదు, అవసరాలకు తగ్గుట్టు కొత్త టెక్నాలజీని సృష్టించడంలోనూ కొందరు సక్సెస్ అవుతున్నారు. అద్భుతాలు క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. కేరళకు చెందిన ఓ విద్యార్థి బృందం అదే చేసింది. మాటలను విని, రాతలుగా రాయగల ‘Talk to write’ అనే ఏఐ ఆధారిత వ్యవస్థ(AI-powered system)ను రూపొందించింది. ఆ బృందంలోని విద్యార్థుల పేర్లేమిటో తెలియదు కానీ.. ఎంటే కేరళం (Ente Keralam) ఎక్స్‌పో - 2025లో ఈ ఆవిష్కరణ జరిగింది. అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాస్‌ప్బెరీ అండ్ ఆర్డునో ఆధారంగా రూపొందించిన ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా స్పీచ్ రికగ్నిషన్‌ను మెకానికల్ చేతిరాత(mechanical handwriting)తో అనుసంధానం చేస్తూ, ఎడ్యుకేషన్, యాక్సెసిబిలిటీ, అలాగే నోట్ ఆటోమేషన్‌లో విస్తృత అప్లికేషన్లను (Wide applications) అందించడంలో ‘టాక్ టు రైట్’ అద్భుతంగా ఉపయోగపడుతుందని దాని క్రియేటర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ టెక్నాలజీ దాని యూజర్ మాటలను విని, వాటిని టెక్ట్స్‌గా మార్చి, ఆ తర్వాత భౌతికంగా చేతిరాత రూపంలో రాస్తుంది. అంటే అచ్చం రోబోట్ రచయితలా పనిచేస్తుంది.

‘టాక్ టు రైట్’ అనే తాజా ఆవిష్కరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సృజనాత్మకతలతో కూడిన ఈ సాంకేతికతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థులకు నోట్స్ రాయడంలో, పెద్దలకు టెక్ట్స్ రూపంలో డేటాను క్రియేట్ చేసి భ్రద పర్చడంలో హెల్ప్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వినికిడి లేదా రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారికి ఎంతో సహాయపడుతుందని పేర్కొంటున్నారు. Video link

Next Story