Viral video : ‘‘Z+ Security‌’’తో వీఐపీ ఎంట్రీ ఇచ్చిన చిన్నారి.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Javid Pasha |

Viral video : ‘‘Z+ Security‌’’తో వీఐపీ (VIP) ఎంట్రీ ఇచ్చిన చిన్నారి.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Viral video : ‘‘Z+ Security‌’’తో వీఐపీ ఎంట్రీ ఇచ్చిన చిన్నారి.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, ఫీచర్స్ : ఒక విధంగా చెప్పాలంటే ఇది సోషల్ మీడియా యుగం. ఏదో ఒక సామాజిక మాధ్యంలో ఖాతాలేని వారంటూ దాదాపు ఉండరు. సక్రమంగా వినియోగించుకుంటే సమాచారానికి, విజ్ఞానానికి ఉపయోగపడుతుంది. దుర్వినియోగపరిస్తే సమస్యలకు కారణం అవుతుంది. ఇన్ఫర్మేషన్ పరంగానే కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గానూ అలరిస్తుంది సోషల్ మీడియా. రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో హల్ చల్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ అందులో ఏం జరిగిందంటే..

వైరల్ వీడియో ప్రకారం.. ప్లేస్ ఎక్కడో తెలియదు కానీ.. ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అంతలోనే ‘మందీ మార్బలం వెనుక రాగా రాజు వెడలె సభకు’ అన్నట్లు ఓ చిన్నారి సడెన్‌గా రోడ్డపై ‘Z+ Security’తో వీఐపీ(VIP)లా ఎంట్రీ ఇవ్వడం, ఓ వింతైన వాహనంపై దర్జాగా కూర్చొని రోడ్డుదాటడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. పట్టుమని ఐదేండ్లు కూడా దాటని చిన్నపాపకు అంత సెక్యూరిటీ, అంత హడావిడి ఎందుకో అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏంటంటే.. ఆ చిన్నారి వెనుక వస్తున్న Z+ Security ఎవరో కాదు, ఆమె అల్లారుముద్దుగా ఆడుకునే కుక్కలు. ఆమె కూర్చొని వెళ్తున్న వింతైన వాహనం కూడా ఒక కుక్కే..‘Bolly Window’ పేరుగల ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేయగా.. అది చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యంతో, ఆనందంతో స్పందిస్తున్నారు. ‘VIP Entry with Z+ Security’ అంటూ పొగిడేస్తున్నారు. ఆలస్యమెందుకూ మీరూ ఓ లుక్కేయండి!

Next Story