- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. లేస్ ప్యాకెట్ లో కోడిగుడ్లు వేసి.. వామ్మో వంట కాదు అంతకు మించి
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోల కోసం కంటెంట్ క్రియేటర్లు రకరకాల పాట్లు పడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోల కోసం కంటెంట్ క్రియేటర్లు రకరకాల పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా వంటల వీడియోలు చేశానని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సాంప్రదాయ వంటలతో పాటు కొంతమంది వెరైటీ వంటలు కూడా చేసేందుకు ఇష్టపడుతున్నారు. వెరైటీ వంటలను చేసినట్లయితే యూజర్లు ఎక్కువగా చూస్తారని వేరే నమ్మకం. అందులో భాగంగా ఎవరూ చేయనటువంటి విచిత్ర విచిత్రమైన వంటలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.
మీరు ఇక్కడ చూస్తున్నటువంటి వీడియోలో ఒక వ్యక్తి మార్కెట్లో లభించే ఒక చిప్స్ ప్యాకెట్ను ఉపయోగించి కోడిగుడ్లతో ఒక వెరైటీ వంటకాన్ని తయారు చేశాడు. ఈ వంటకం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఓపెన్ చేసి అందులో రెండు కోడిగుడ్లు వేసి ఆ తరువాత పార్టీలో కూరగాయ ముక్కలు ఉప్పు కారం నూనె అన్ని వేసి ఇప్పుడు బాగా కలిపి ఆ ప్యాకెట్ను మళ్ళీ సీల్ చేసి దాన్ని ఒక వేడి నీటిలో ఉడికించి ఆ తర్వాత కవర్ ఓపెన్ చేసి అందులో ఉడికిన కోడిగుడ్ల మిశ్రమాన్ని కట్ చేసి ముక్కలుగా చేసుకుని తిన్నాడు.
ఇది చాలా బాగుందని అతను అన్నప్పటికీ నెటిజన్స్ మాత్రం, ఒక ప్లాస్టిక్ కవర్ను ఆ విధంగా ఉడికించి చేయడం వల్ల ఆ ప్లాస్టిక్ లో ఉండే విషకణాలు అన్ని ఆ ఫుడ్ లోకి వెళ్తాయని, తద్వారా ఇలాంటి ఆహార పదార్థాలు తిన్నవారికి క్యాన్సర్ గ్యారెంటీ అని కామెంట్లలో పెడుతున్నారు.
ఇలాంటి వింత విచిత్రమైన దరిద్రమైన ఐడియాలు ఎలా వస్తాయి రా బాబు అని మరో యూజర్ కూడా కామెంట్ పెట్టాడు. అసలు ఇలాంటి చిత్రవిచిత్రమైన ఆలోచనలు వచ్చే ఆ బుర్రకు జోహార్లు అంటూ మరో యూజర్ కూడా కామెంట్ పెట్టాడు. మొత్తానికి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఈ కంటెంట్ క్రియేటర్ పడుతున్న బాధలు చూసి ఓ లైక్ కొడతామని మరో యూజర్ రాసుకొచ్చాడు.
Read More..






