- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eye Drop : సర్జరీ, కళ్లద్దాల అవసరమే లేదు..! జస్ట్ 2 చుక్కలు చాలు.. కంటిచూపు మెరుగుపడే EYE DROPను అభివృద్ధి చేసిన నిపుణులు
యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన లెంజ్ థెరప్యూటిక్స్ సమీప దృష్టిలోపాన్ని నివారించగల విజ్ ఐ డ్రాప్‌ను రీసెంట్‌గా డెవలప్ చేయగా.. FDA ఆమోదం కూడా పొందింది

దిశ, ఫీచర్స్ : ఏజ్ రిలేటెడ్ కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? సమీప దూరదృష్టితో(Nearsightedness)వస్తువులను చూడలేకపోతున్నారా? అయితే సర్జరీ, కళ్లద్దాలు వంటి అవసరం లేకుండానే.. మీ సమీప దృష్టిని మెరుగు పర్చగల ఐ డ్రాప్స్ ఇక అందుబాటులోకి రానున్నాయి. యూఎస్‌కు చెందిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. జస్ట్ రెండు చుక్కలు కంటిలో వేసుకుంటే చాలు.. మసకబారిన కంటిచూపు తిరిగొస్తుంది. సమీప వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి.
యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన లెంజ్ థెరప్యూటిక్స్ (LENZ Therapeutics), వయసు సంబంధిత సమీప దృష్టిలోపాన్ని(Presbyopia) నివారించగల విజ్ (Vizz) అనే ఐ డ్రాప్‌ను రీసెంట్‌గా డెవలప్ చేయగా.. అది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదం కూడా పొందింది. ఈ కంటి చుక్కల మందు దృష్టిలోపం ఉన్న పెద్దలకు సర్జరీ అవసరం లేకుండానే చక్కటి పరిష్కారాన్ని అందిస్తుందని దాని అభివృద్ధిలో భాగమైన పరిశోధకులు పేర్కొంటున్నారు.
సమీప దృష్టిలోపం ఉన్నవారు (Presbyopia) విజ్ (Vizz) ఐ డ్రాప్స్‌ను కంటిలో వేసుకుంటే చాలు.. అవి రెటీనా కండరాన్ని సున్నితంగా సంకోచింపజేసి (Gently squeeze), ఒక పిన్‌హోల్ ఎఫెక్ట్‌ను క్రియేట్ చేస్తాయి. ఈ పరిస్థితి సమీపంలోని వస్తువులపై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. క్లినికల్ ట్రయల్స్ ద్వారా రుజువైన ఈ ఔషధం, వాడిన 30 నిమిషాలలోపు పని చేయడం ప్రారంభించి, 10 గంటల వరకు సమీప దృష్టిని మెరుగుపరుస్తున్నట్లు తేలింది. యునైటెడ్ స్టేట్స్‌లో సుమారు 128 మిలియన్ల మంది ప్రెస్బయోపియా(Presbyopia)తో బాధపడుతుండగా.. తాజా కంటి చుక్కల మందు వారిలో ఆశలు రేకెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా త్వరలో ఈ ఐ డ్రాప్ అందుబాటులోకి రానుందని నిపుణులు చెబుతున్నారు. లింక్
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






