హోంవర్క్‌ చేయనని మొండికేసిన బాలుడు.. ఎంత పనిచేశాడో తెలిస్తే షాక్ అవుతారు !

by Dishanational2 |
హోంవర్క్‌ చేయనని మొండికేసిన బాలుడు.. ఎంత పనిచేశాడో తెలిస్తే షాక్ అవుతారు !
X

దిశ, ఫీచర్స్ : హోం వర్క్ పూర్తిగా కంప్లీట్ చేయాలని సూచించిన తల్లితో ఓ పదేళ్ల బాలుడు వాదనకు దిగాడు. ఆ తర్వాత తల్లికి తెలియకుండా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తరచూ హోం వర్క్ చేయాలని తల్లి తనను వేధిస్తోందని ఫిర్యాదు చేశాడు. అంతేగాక రోజు రోజుకూ టార్చర్ ఎక్కువవుతోందని, ఇక తను ఇంట్లో ఉండదల్చుకోలేదని తెలిపాడు. తనను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలని పోలీసులను వేడుకున్నాడు. చైనాలోని చాంగ్‌కింగ్‌ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

యువీలోని హుయిక్సింగ్ పోలీస్ స్టేషన్‌లోకి పరుగు పరుగున వచ్చిన ఒక బాలుడు పోలీసులతో ఏదో చర్చిస్తున్నట్లు ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి ఆధారంగా అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించిన చైనీస్ మీడియా అసలు విషయం బయట పెట్టింది. సదరు బాలుడు, అతని పేరెంట్స్ పేర్లయితే వెల్లడించలేదు కానీ, జరగిన విషయం ప్రపంచానికి తెలియపర్చింది. సదరు బాలుడి మాటలు విని షాక్ అయిన పోలీసులు ఆ బాలుడిని కూల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట. ‘అమ్మ నీ మంచికోసమే హోం వర్క్ చేయాలని చెప్తుంది. దానిని టార్చర్‌గా భావించవద్దు’ అంటూ చాలాసేపు మోటివేట్ చేశారట. ఎట్టకేలకు తిరిగి ఇంటికి వెళ్లడానికి బాలుడు ఒప్పుకోవడంతో పోలీసులు అతని పేరెంట్స్‌ను పిలిపించారు. ముగ్గురికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి పంపించారు. వైరల్ అవుతున్న ఈ వార్తపై స్పందిస్తున్న నెటిజన్లు బాలుడిని ఉద్దేశించి ‘మహా ముదురు’ అని, మరి కొందరు ‘దారి తప్పుతున్న బాల్యం’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు

Read More: ఈ పురుగులను ముట్టుకుంటే ప్రాణం గాల్లో కలిసిపోతుంది?


Next Story