ఈ పురుగులను ముట్టుకుంటే ప్రాణం గాల్లో కలిసిపోతుంది?

by Disha Web Desk 10 |
ఈ పురుగులను ముట్టుకుంటే ప్రాణం గాల్లో కలిసిపోతుంది?
X

దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుత సమాజంలో మనిషి డబ్బు వెంట పరిగెత్తడంలోనే జీవితం మొత్తం అవుతుందనే చెప్పుకోవాలి. ఇంత బిజీగా ఉన్న జీవితంలో కొన్ని సార్లు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి మనిషి అనేక ప్రదేశాలకు వెళ్తుంటాడు. అయితే ఇలా ప్రకృతి అందాలను వీక్షించడానికి వెళ్ళినప్పుడు మనం అనేక జీవులు చూస్తుంటాము. అయితే వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ప్రకృతి అందాలను వీక్షించేటప్పుడు మనకి కొన్ని పురుగులు కనిపిస్తాయి. ఒక్కసారి ఆ పురుగును పట్టుకుంటే ఎంత బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి ఆలోచన రాక మానదు. కానీ అలా చేస్తే చివరికి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ భూమి మీద సంచరించే కీటకాల్లో ప్రధానంగా ఈ పురుగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. ఆ పురుగు వెంట్రుకల గొంగళి పురుగు. దీనిని చూస్తే పైకి పువ్వులా చాలా అందంగా కనిపిస్తుంది. సన్నగా పసుపు రంగులో ఉంటుంది. అయితే ఈ గొంగళి పురుగుల విషం ప్రమాదకరమైనది. వీటిని తాకగానే భరించలేని నొప్పి కలుగుతుంది. రక్త శ్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇక ఈ వెంట్రుకల గొంగళి పురుగులు మన దేశంలో కాకుండ ఎక్కువగా ఫ్లోరిడా టెక్సాస్ ప్రాంతాల్లో ఉంటాయి.

Read More: గర్భిణులపై మెంటల్ హెల్త్ ఎఫెక్ట్.. నెలలు నిండకుండానే ప్రసవించే అవకాశం !



Next Story

Most Viewed