నా ప్రియుడిని చంపొద్దు.. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. హీరోయిన్ పబ్లిక్ అప్పీల్

by Dishafeatures3 |
నా ప్రియుడిని చంపొద్దు.. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. హీరోయిన్ పబ్లిక్ అప్పీల్
X

దిశ, సినిమా : హీరో సల్మాన్ ఖాన్ కు ఇప్పటికే బిష్ణోయ్ కమ్యూనిటీ వార్నింగ్ ఇచ్చింది. ఇంటి బయట కాల్పులు జరిపి ప్రాణ హాని ఉందని.. రెడీగా ఉండమని చెప్పకనే చెప్పింది. దీంతో ఆయన నివాసంలో పోలీసుల బందోబస్తు పెరిగింది. ఇదిలా ఉంటే తన మాజీ ప్రియురాలు సోమీ అలీ.. సల్లూ భాయ్ ను చంపొద్దని పబ్లిక్ గా వేడుకుంది.

నిజానికి తప్పు ఎవరైనా చేస్తారు కానీ సరిదిద్దుకోవడం ముఖ్యం. సల్మాన్ ఇప్పటికే రియలైజ్ అయ్యాడు. జింకలను చంపడం తప్పేనని.. కానీ తనను క్షమించాలని ఆయన తరపున వేడుకుంది. సల్మాన్ తెలిసీ తెలియక చేసిన తప్పుకు హత్య చేయడం దారుణమని.. మనుషులను మనుషులు చంపుకోవడం ఉండకూడదని ప్రాధేయపడింది. తనను వదిలేయాలని చేతులెత్తి మొక్కుతున్నానని ఎమోషనల్ అయింది. కాగా సల్లూ భాయ్ నివాసం ఎదుట కాల్పుల కేసులో ఇప్పటికే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

Next Story

Most Viewed