Pinnelli: మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకే నా ఏడుపు.. అంబటి వైఖరి

by Indraja |
Pinnelli: మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకే నా ఏడుపు.. అంబటి వైఖరి
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పోలింగ్ వేళ వైసీపీ అభ్యర్థులు ప్రవర్తించిన తీరు అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయవర్గాల్లోనూ విమర్శలకు దారితీసింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్ పై చేయి చేసుకోవడం, మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేయడంపై ఈసీ కన్నెర్ర చేసింది.

ముఖ్యంగా ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించిన వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగబద్ద పదివిలో ఉండి ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై కేసు నమోదైంది. దీనితో పిన్నెల్లి తన కారు, ఫోను సైతం వదిలేసి పరారైనట్టు తెలుస్తోంది. పిన్నెల్లి నేరం చేసినట్టు కళ్లముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా పిన్నెల్లి ఏ పాపం ఎరుగని సుద్దపూస అని వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మాచర్లలో దారుణాలు చేటుచేసుకున్నాయని, పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్న వైసీసీ ఓటర్లను అడ్డుకుని, వాళ్లను కొట్టి, తన్ని గాయపరిచి బయటకు పంపించారని ఆవేధన వ్యక్తం చేశారు. అలానే ఈ ఘటలపై పిన్నెల్లి సైతం ఫిర్యాదు చేశారని, ఫోన్లు చేశారని, కాని పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు.

కాగా పిన్నెల్లి ఈవీయంలు పగల గొడుతున్న వీడియోని లోకేష్ ట్విట్టర్‌లో పెట్టడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. ఆ వీడియో విడుదల చేసే ముందు అది ఫేక్ వీడియోనా, ఎవిడన్స్ ఆ ఆలోచించాలి కదా అంటూ మండిపడ్డారు. పిన్నెల్లి ఈవింలు పగల గొడుతున్నట్టు విడుదలెన వీడియో ఫేక్ వీడియో అని స్పష్టం చేశారు. అయితే పిన్నెల్లి ఈవీయంలు ధ్వంశం చేయకపోతే ఎందుకు పరారీలో ఉన్నారు..?

ఎందుకు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు..? తాను ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి, తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కళ్లముందు సాక్ష్యాలు కనిపిస్తుంటే..వాటికి మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే కుదరదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈవీయంలను పగలగొట్టి పార్టీ నేత పార్టీ పరువు తీస్తే తప్పులేదుగానీ, లోకేష్ వీడియో విడుదల చేయడమే తప్పుగా కనిపిస్తుందా..? ఇది ఎలా ఉందంటే మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకే నా ఏడుపు అన్నట్టు ఉందని టీడీపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.

Next Story

Most Viewed