కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నాడంటే?

by Hamsa |
కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నాడంటే?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి2898ఏడి’. దీనిని స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో.. కల్కి మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందుకే ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించి ఇందులో నటిస్తున్న ఓ స్పెషల్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.

బుజ్జి, భైరవ అనే ఈవెంట్‌ను పెట్టి అభిమానులతో చిత్ర యూనిట్ ముచ్చిటించారు. ఇందులో భాగంగా.. ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ‘‘ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి యాక్టర్స్‌తో కలిసి పని చేయడం సంతోషంగా, గర్వంగా ఉంది. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారంతా బిగ్ బి నీ అభిమానిస్తూనే ఉంటారు. నిజానికి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది సినీ రంగంలోకి వచ్చారు.

ఆయనలాంటి నటుడు భారత్‌లో ఉన్నందుకు దేశం చాలా గర్వంగా ఫీలవ్వాలి. అలాగే కమల్ హాసన్ సాగర సంగమం సినిమాలో వేసుకున్న డ్రెస్సులు నాకు చాలా నచ్చాయి. చిన్నప్పుడే అలాంటివి అమ్మను అడిగి మరి తెప్పించుకుని వేసుకున్నాను. ఆయన నటనకు 100 దండాలు. దీపికా పదుకొణె ఓ సూపర్ స్టార్, అలాగే దిశా పటానీ హాట్ స్టార్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story

Most Viewed