ఊర్వశీ రౌతేలా తన ఎక్స్ అంటూ బాంబు పేల్చిన మన యూట్యూబర్

by Sujitha |
ఊర్వశీ రౌతేలా తన ఎక్స్ అంటూ బాంబు పేల్చిన మన యూట్యూబర్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ ఊర్వశీ రౌతేలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అదరహో అనిపించింది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్న పర్సనల్ లైఫ్‌ ఇష్యూస్‌తో లైమ్ లైట్‌లో ఉండేందుకు ట్రై చేస్తుంది. అలా క్రికెటర్ రిషబ్ పంత్ కథ ముగిసిందో లేదో ఇప్పుడు కొత్తగా యూట్యూబర్‌తో స్టోరీ స్టార్ట్ అయింది. ఓ డేటింగ్ షోకు ఈ బ్యూటీ ఎంటర్ కాబోతుండగా.. యూట్యూబర్ అదితి మోనాంచా కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రోమో రిలీజ్ కాగా ‘త్వరలో నా ఎక్స్ రాబోతుంది’ అని ఇందులో చెప్పడంతో.. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఇంకా ఎన్ని ఖాతాలు ఓపెన్ చేసి ఉంచిందో అని ఊర్వశిని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉంది. అటు సామాజిక కార్యక్రమాలు చేపడుతూనే ఇటు మోడలింగ్, మూవీస్‌లో బిజీ అయిపోతుంది. అయితే రిషబ్ పంత్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు నటించేందుకు ఎందుకు ట్రై చేసిందో ఇప్పటికీ అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. కాగా ఊర్వశి తెలుగులో చిరంజీవి, రామ్ పోతినేని లాంటి స్టార్స్‌తో మసాలా సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed