దిశ ఎఫెక్ట్... స్పందించిన విద్యాశాఖ అధికారులు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్... స్పందించిన విద్యాశాఖ అధికారులు
X

దిశ,మహేశ్వరం : దిశ పత్రికలో ఈ నెల 21 తేదీన అనుమతులు లేకుండానే అడ్మిషన్లు...?, 23 తేదీన నిద్రమత్తులో అధికారులు...? అని వచ్చిన వరుస కథనాలకు గురువారం ఎంఈవో కృష్ణయ్య స్పందించారు. మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కి ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రవేశాలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేని స్కూల్లో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులను కోరారు. దిశ పత్రికలో వచ్చిన కథనానికి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యంకు నోటీసులు ఇచ్చామన్నారు. అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులకు కూడా వెనుకాడబోమన్ని పేర్కొన్నారు.

Next Story

Most Viewed