Viral video: అసలు ఆమె ఆడదేనా! అన్న భార్య తమ్ముడి బిడ్డలకు విషం? వీడియో వైరల్

by Ramesh N |
Viral video: అసలు ఆమె ఆడదేనా! అన్న భార్య తమ్ముడి బిడ్డలకు విషం? వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మానవత్వం మరిచిన ఓ దారుణ సంఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుందని ఓ కథనం వైరల్ అవుతోంది. అన్నయ్య భార్య తమ్ముడి బిడ్డలకు విషం ఇచ్చిందని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఎన్‌జీవో ట్వీట్టర్ వేదికగా ఈ వీడియో పోస్ట్ చేసింది. కమిషన్ తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా భద్రేస్ గ్రామంలో అన్న భార్య తమ్ముడి బిడ్డకు విషం ఇచ్చింది. గతంలో తమ్ముడి ఇద్దరు పిల్లలు ఇలాంటి పరిస్థితిలో చనిపోయారు. అయితే ఆ బిడ్డల తల్లికి అన్న భార్యపై పాత్రపై అనుమానం వ్యక్తం చేసింది. తర్వాత తమ్ముడికి మరో సంతానం కలిగింది. ఈ సారి అతని భార్య అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్నయ్య భార్య వచ్చి మంచం పై పడుకొని ఉన్న పసిబిడ్డకు నోట్లో ఏదో మందు పోస్తోంది. ఇదంతా కెమెరాల్లో రికార్డు అవుతుంది. అనంతరం పసిబిడ్డను మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచారని, చిన్నారి ప్రస్తుతం క్షేమంగా ఉందని కమిషన్ తెలిపింది.

ఈ విషయంపై కమిషన్ సభ్యులు గ్రామస్తులతో మాట్లాడటానికి ప్రయత్నించిన కానీ వారందరూ ఈ ఘటనపై పరస్పర విరుద్ధమైన కథనాలను ఇస్తున్నారని కమిషన్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆ కుటుంబంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు, తాము వారితో కమ్యూనికేట్ అయిన తర్వాత మరిన్నీ విషయాలు అప్‌డేట్ చేస్తామని మెన్ కమిషన్ పేర్కొంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ విషం ఇస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు మహిళ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఆమె ఆడదేనా? ఏ మాత్రం మానవత్వం లేకుండా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఈ ఘటనపై బార్మర్ పోలీసులు స్పందించారు. ఈ వీడియో భద్రేస్ నివాసి ముఖేష్ ప్రజాపత్ కుమారుడిదిగా చెప్పబడుతోంది. ముఖేష్ ప్రజాపత్‌తో మొబైల్‌లో మాట్లాడినప్పుడు, తన కొడుకుతో అలాంటి సంఘటన జరగలేదని ఖండించారు. తదుపరి విచారణ జరుగుతోంది. రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి చిన్నారి తండ్రి, తాతయ్య ఇంటికి వెళ్లి ఘటనపై సమగ్ర విచారణ చేయగా.. అలాంటి ఘటనేమీ జరగలేదని కుటుంబీకులు తెలిపారు. అని ట్విట్టర్ వేదికగా బార్మర్ పోలీసులు పోస్ట్ చేశారు.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed