- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News : ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఏకంగా కిడ్నీ అమ్ముకున్న టీనేజర్(వీడియో)
సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూస్తుంటే ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు పాట గుర్తొస్తుంది. అవును.. తన ప్రేమికురాలికి ఐఫోన్ 16 ప్రో మాక్స్ గిఫ్ట్‌గా ఇవ్వాలని భావించిన టీనేజర్.. ఏం చేయాలో పాలుపోక

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూస్తుంటే ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు పాట గుర్తొస్తుంది. అవును.. తన ప్రేమికురాలికి ఐఫోన్ 16 ప్రో గిఫ్ట్‌గా ఇవ్వాలని భావించిన టీనేజర్.. ఏం చేయాలో పాలుపోక కిడ్నీ అమ్ముకున్నాడు. ఇదంతా ప్రేమకోసమేనని చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ముందు చదువు మీద ఫోకస్ చేయ్ తర్వాత ఇలాంటి ఎక్స్‌ట్రాలు చేద్దువు కానీ అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇంత దారుణంగా ఉందేంటి ఈ జనరేషన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఇతను అమ్మింది కిడ్నీనేనా అని ఇంకొందరు అనుమానిస్తున్నారు. అయితే ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఐఫోన్ 16 ప్రో (256GB) ధర సుమారు ₹1,29,900 నుంచి మొదలవుతుంది.
కాగా ఇలాంటి ఘటన చైనాలోనూ 2011లో జరిగింది. స్నేహితుల ముందు గొప్పలు పోయేందుకు ఐఫోన్, ఐప్యాడ్ వినియోగించాలనుకున్న పదిహేడేళ్ల కుర్రాడు వాంగ్ షాంగ్‌కున్.. మూత్రపిండాన్ని అమ్ముకున్నాడు. తన తల్లిదండ్రులు ఎలాగూ కొనివ్వలేరని నిర్ణయించుకుని ఈ పని చేశాడు. వారికి తెలియకుండా హునాన్ ప్రావిన్స్‌లో చట్టవిరుద్ధమైన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. రెండు మూత్రపిండాలు ఎందుకు ఒక్కటి చాలు కదా అని స్టేట్మెంట్ కూడా ఇచ్చిన ఈ కుర్రాడు.. కొద్ది రోజులకే రెండో కిడ్నీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆ కిడ్నీ ఫెయిల్ అయింది. ఈ కేసు తొమ్మిది మంది అరెస్ట్‌కు దారితీయగా.. షాంగ్‌కున్ కుటుంబానికి సుమారు $300,000 పరిహారం లభించింది.






