- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Romantic life : అక్కడ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్న జంటలు.. కారణం ఇదే!
Romantic life : అక్కడ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్న జంటలు.. కారణం ఇదే!

దిశ, ఫీచర్స్ : పరస్పర నమ్మకం ఉన్నప్పుడు అన్నీ సవ్యంగానే అనిపిస్తాయి. ఎప్పుడైతే నమ్మకం సడలుతుందో అక్కడ అనుమానాలు, అవమానాలు, అవస్థలు మొదలవుతాయి. ఆధునిక దాంపత్య జీవితంలోనూ అలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. భారత దేశంలో తక్కువ కానీ.. యునైటెడ్ స్టేట్స్‌లో జంటల మధ్య ఒకప్పటితో పోలిస్తే ప్రేమానురాగాలు, లైంగిక జీవితంపట్ల ఆసక్తులు తగ్గుతున్నాయని ఒక బిగ్గెస్ట్ మార్కెటింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇందకు ప్రధాన కారణం ఒకరిపట్ల ఒకరికి నమ్మకం లేకుండా పోవడమేనట.
తాజా సర్వే ప్రకారం.. యూఎస్ ప్రజల్లో అత్యధిక మంది తమ జీవిత భాగస్వామితో పూర్తిస్థాయి సంతృప్తిగా ఉండటం లేదు. కేవలం 36 శాతం మంది మాత్రమే లైఫ్ పార్టనర్‌తో శృంగార జీవితాన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేగాక ప్రతీ ఐదుగురు పెద్దల్లో ఒకరు మూడేండ్ల కంటే ఎక్కువ కాలం ఒకే రిలేషన్ షిప్‌లో ఉండటం లేదు. లవ్ అండ్ సెక్స్ పరంగా సంతృప్తి లేకపోవడమే ఇందుకు కారణమని సర్వేలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 5,000 మంది అమెరికన్లపై జరిపిన సర్వేలో సుదీర్ఘకాలంపాటు ఒకే రిలేషన్ షిప్‌లో కొనసాగుతూ సంతోషకరమైన జీవితాన్ని గడిపేవారు చాలా తక్కువమంది ఉంటున్నారని తేలింది. ఒక్క న్యూ హాంప్‌షైర్(New Hampshire) ప్రాంతంలో మాత్రం కనీసం 15 సంవత్సరాల వరకు జంటలు సంతోషంగా కలిసి ఉంటున్నాయి.
టీనేజ్‌లోనే డేటింగ్..
మూడింట ఒకవంతు జంటలు టీనేజీలోకి అడుగు పెట్టగానే డేటింగ్ ప్రారంభిస్తున్న పరిస్థితి విదేశాల్లో ఉంది. మసాచుసెట్స్, న్యూయార్క్, వ్యోమింగ్‌లలో 50% శాతంమందిని ప్రశ్నించగా 38% మంది ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సర్వే పేర్కొన్నది. ఇటువంటి పరిస్థితి కూడా భాగస్వాముల మధ్య తర్వాత అసంతృప్తికి కారణం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆసక్తి, నమ్మకం లేకపోయినప్పటికీ శృంగార జీవితాన్ని నెట్టుకొస్తున్నవారు ఉటాలో 35% శాతం మంది, ఓక్లహోమాలో 34% మంది, వెస్ట్ వర్జీనియాలో 32% మంది, పెన్సిల్వేనియా, మిస్సౌరీలలో 32% చొప్పున, కాలిఫోర్నియా 36 శాతం మంది ఉన్నారు. అమెరికన్ జంటల్లో ప్రతీ ఐదుగురిలో ఒకరు తమ భాగస్వామి తమను మోసం చేస్తున్నారని కూడా పేర్కొంటున్నారు. ఇలా మోసపోయిన వారిలో విస్కాన్సిన్‌కు చెందిన వారు ఎక్కువగా 52% మంది ఉన్నారు. అమెరికాలో సగటు ఒక వ్యక్తి తన జీవితకాలంలో నలుగురితో సీరియస్‌గా డేటింగ్ చేసినట్లు కూడా సర్వేలో తేలింది. ఒకే వ్యక్తితో కొనసాగేవారు చాలా అరుదు. అయితే ఇల్లినాయిస్(from Illinois) చెందినవారిలో మాత్రం చాలామంది ఒకే భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటున్నారు.
అందరూ అలాగే ఉండకపోవచ్చు!
రిలేషన్ షిప్స్ వ్యక్తిగతమైనవి. ఆయా ప్రాంతాలు, అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలను బట్టి కూడా అవి కొనసాగడం లేదా మారుతుండటం జరగవచ్చు. లవ్ అండ్ ఎంజాయ్ మెంట్ విషయానికి వస్తే అందరూ ఒకేలా ఉండటం లేదని సర్వేలో పాల్గొన్న లియో తెలిపాడు. ఆయా జంటల సొంత ఆలోచనలు, అవసరాలపై ఆధారపడి లవ్, సెక్స్, ఆనందం, స్వేచ్ఛ వంటివి ఆధారపడి సర్వేను ఎనలైజ్ చేసిన అధికారులు అంటున్నారు. ఇక రొమాంటిక్ లైఫ్ విషయానికి వస్తే సగటున అమెరికన్లు తమ భాగస్వామితో వారానికి మూడుసార్లు మాత్రమే రొమాంటిక్ జీవితాన్ని గడుపుతున్నారు. అమెరికా మొత్తంగా చూస్తే 36 శాతం జంటలు మాత్రమే సెక్స్ పరమైన లైఫ్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక మిగతా వారి విషయాలను పరిశీలిస్తే.. పార్టనర్‌తో కలిసి బయటకు డిన్నర్‌కు వెళ్తున్న వారు 46% మంది, రాత్రి పూట కలిసి ఉంటున్నవారు 28% మంది, సినిమాలకు వెళ్తున్నవారు 22% మంది ఉంటున్నారు.






