- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంబంధాల్లో ఆర్థిక భద్రతే ముఖ్యం.. 50% మంది మహిళల ఫీలింగ్ ఇదే..
జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, భావోద్వేగ సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే సంబంధాలు నిలబడతాయని నిపుణులు అంటున్నారు

దిశ, ఫీచర్స్ : మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతుంటారు. గాలి, నీరు, ఆహారం మాదిరిగానే ఆర్థిక స్థిరత్వం కూడా ఒక కచ్చితమైన జీవన అవసరమని అంటుంటారు. సైకాలజీ టుడే (Psychology Today) అండ్ యూగోవ్ (YouGov) సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వే కూడా అదే విషయాన్ని వెల్లడించింది. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, భావోద్వేగ సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని, సంబంధాలు నిలబడతాయని పేర్కొన్నది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
మానవ సంబంధాల్లో ఆర్థిక విషయాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించిన సర్వేలో భాగంగా నిపుణులు 18 నుంచి 45 ఏండ్లలోపు వయసు గల 2000 మందిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్టిసిపెంట్స్ వ్యక్తం చేసిన పలు ఆసక్తికరమైన విషయాలను వారు వెల్లడించారు. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం ఉన్నప్పుడే జీవితంలో సంతోషంగా ఉంటామని అనేక మంది వెల్లడించగా.. 50% కంటే ఎక్కువ మంది మహిళలు ఆధునిక సంబంధాల్లో ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. తమ భాగస్వామి ఉద్యోగాన్ని కోల్పోయి, ఆర్థిక స్థిరత్వాన్ని అందించలేకపోతే సంబంధాన్ని వదులుకునే విషయమై ఆలోచిస్తామని కూడా వీరు ఒప్పుకున్నట్లు సర్వే స్పష్టం చేసింది. దీనిని బట్టి జీవితంలో ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. ప్రతీ ఒక్కరు తమ కనీస అవసరాలు తీర్చుకునే విధంగా ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారని సూచిస్తున్నారు. Link






