- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Back pain : బ్యాక్ పెయిన్ వేధిస్తోందా..? నాలుగు వారాలు ఇలా చేస్తే రమ్మన్నా రాదు!
Back pain : బ్యాక్ పెయిన్ వేధిస్తోందా..? నాలుగు వారాలు ఇలా చేస్తే రమ్మన్నా రాదు!

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న సమస్యల్లో వెన్ను లేదా నడుము నొప్పి(back pain) ఒకటి. భారత దేశంలో అయితే ప్రతీ 100 మందిలో 48 మంది ఈ సమస్యతో అవస్థలు పడుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నిశ్చల జీవనశైలి, ఆహారపు అలవాట్లతోపాటు పలు అనారోగ్యాలు ఇందుకు కారణం అవుతున్నాయి. వెన్నునొప్పి సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల వ్యాయామాలు పాటించడం ద్వారా ఆ సమస్య దూరం అవుతుందని, ముఖ్యంగా 4 వారాలపాటు పైలేట్ కోర్ వ్యాయామాలు చేయడం ద్వారా వెన్నునొప్పిని సమస్యను 58% వరకు తగ్గించవచ్చునని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది.
వాస్తవానికి పైలేట్స్ వ్యాయామాలు (Pilates core exercises) కోర్ స్థిరత్వం (core stability), శరీర సమతుల్యత, కంట్రోలింగ్ బాడీ మూమెంట్స్‌పై ఫోకస్ చేస్తాయి. కాబట్టి ఇవి దీర్ఘకాలిక వెన్ను నొప్పిని కారణమయ్యే కండరాల అసమతుల్యతను, బలహీనతలను సరిచేయడంలో సహాయపడతాయని ఆర్థోపెడిక్ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ వ్యాయామాలు వెన్నెముక కండరాలను లక్ష్యంగా చేసుకొని, కటి ప్రాంతానికి సపోర్ట్‌ను మెరుగుపరుస్తాయి. అట్లనే శరీర సౌలభ్యం(body's flexibility) కదలికల సామర్థ్యాన్ని (mobility) పెంచుతాయి. దీంతోపాటు కోర్ వ్యాయామాల మెరుగైన భంగిమ, కదలికలలో స్టిఫ్‌నెస్‌ను నివారించడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందంటున్నారు నిపుణులు.
లంబోపెల్విక్ స్థిరత్వాన్ని(lumbopelvic stability) మెరుగుపరిచే కండరాలైన ట్రాన్స్‌వర్స్ అబ్డామినిస్, మల్టిఫిడస్, డయాఫ్రాగమ్, అలాగే పెల్విక్ ఫ్లోర్ కండరాలను కూడా కోర్ వ్యాయామాలు బలోపేతం చేస్తాయి. అంటే వెన్నెముకను స్థిరంగా ఉంచడంలో, కటి ప్రాంతంపై ఒత్తిడిని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే బ్యాక్ పెయిన్ తిరిగి రమ్మన్నా రాదని కొందరు చమత్కరిస్తుంటారు. అంతేకాకుండా కోర్ వ్యాయామాలు దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉన్నవారికి నాలుగు వారాల్లోనే గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తాయని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.






