మనసు ఏం బాగోలేదు..! ప్రతీ ఐదుగురిలో ఒకరి పరిస్థితి అంతే..

by Javid Pasha |   (  Updated:2025-08-04 08:15:13  IST  )

మనసు ఏం బాగోలేదు..! ప్రతీ ఐదుగురిలో ఒకరి పరిస్థితి అంతే..

మనసు ఏం బాగోలేదు..! ప్రతీ ఐదుగురిలో ఒకరి పరిస్థితి అంతే..
X

దిశ, ఫీచర్స్ : ‘మనసేం బాగోలేదు బ్రో.. ఏమో.. నా మైండ్ పనిచేస్తలేదు..’ ఈతరం యువతలో ఇలాంటి మాటలు వినపించడం చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు నిరాశ, నిస్పృహ 40 ఏండ్లు దాటినవారిలో అరుదుగా కనిపించేది. కానీ ఇప్పుడు యుక్త వయసు మొదలు కొని వృద్ధుల వరకు ఏదో ఒక విషయంలో మానసిక సంక్షోభం వెంటాడుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆధునిక యువత మానసిక అస్థిరతతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొన్నది.

అనుకున్నది జరగకపోవడం, ప్రియమైన వ్యక్తులు దూరం కావడం, స్నేహితులు, ప్రేమికుల మధ్య మనస్పర్థలు, తగాదాలు, బ్రేకప్‌లు, తల్లిదండ్రుల నుంచి, స్నేహితుల నుంచి భావోద్వేగ మద్దతు లభించకపోవడం, రిలేషన్‌షిప్‌లో సమస్యలు వంటివి యువతలో మానసిక ఆవేదనకు దారితీస్తున్నాయని అధ్యయనం పేర్కొన్నది. ఇక పెద్దల్లో కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు దూరం కావడం, ఆర్థిక ఇబ్బందులు వంటివి మానసిక ఆందోళనకు కారణం అవుతున్నట్లు తెలిపింది. మొత్తంగా చూసినప్పుడు ప్రతీ ఐదుగురిలో ఒకరు ప్రస్తుతం మానసిక అస్థిరత (Mental instability)తో బాధపడుతున్నారని, స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్, భావోద్వేగ సమస్యలు, ప్రవర్తనా పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మానసిక ఆరోగ్య సంక్షోభానికి తాజా అధ్యయనమే నిదర్శనమని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే సోషల్ మీడియా అధిక వినియోగం, ఆర్థిక ఒత్తిళ్లు, వృత్తిపరమైన సవాళ్లు, ఆర్థిక అస్థిరత, సంబంధాల్లో తగ్గుతున్న భావోద్వేగ మద్దతు, పలు అంశాల్లో వైఫల్యాలు వంటివి ఎక్కువగా మానసిక సంక్షోభానికి దారితీస్తున్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది. కొవిడ్ మహమ్మారి తర్వాత కొనసాగుతున్నదీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం కూడా ప్రజల్లో మానసిక ఆందోళనకు, సంక్షోభానికి దారితీస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2025 సంవత్సరానికి సంబంధించిన డబ్ల్యుహెచ్ఓ నివేదిక సైతం 2019లో 970 మిలియన్ల మంది మానసిక రుగ్మతలతో బాధపడ్డారని, అది ఆ పరిస్థితి కొనసాగుతున్నదని, యాంగ్జైటీ, డిప్రెషన్ (Anxiety and depression) వంటివి అత్యంత సాధారణమై పోయాయని పేర్కొన్నది.

Next Story